భారత్‌లో గత 24 గంటల్లో 78 వేలకు పైగా రికవరీలు

భారత్‌లో గత 24 గంటల్లో 78 వేలకు పైగా రికవరీలు

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా ఒక వెయ్యి 95 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 99 వేల 773కి చేరినట్టు..కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజులో కొత్తగా... 81 వేల 484 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 63 లక్షల 94 వేలు దాటింది.

వైరస్‌ సోకినవారిలో 9 లక్షల 42 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 53 లక్షల 52 వేల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్క రోజలో దేశవ్యాప్తంగా 10 లక్షల 97 వేల పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు.. దేశంలో 7 కోట్ల 67 లక్షల మందికి కరోనార టెస్టులు నిర్వహించినట్టు ICMR తెలింది. గత 24 గంటల్లో 78 వేల 877 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 83.70 శాతానికి చేరగా... మరణాల రేటు 1.56 శాతంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story