Kerala: ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. ఐదేళ్ల చిన్నారి మృతి

Kerala: ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. ఐదేళ్ల చిన్నారి మృతి
కేరళలోని కొల్లాం జిల్లాలోని కొట్టంకులంగర దేవి ఆలయంలో 'చమయవిళక్కు' ఉత్సవం జరిగింది.

కేరళలోని కొల్లాం జిల్లాలోని కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో 'చమయవిళక్కు' పండుగ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఐదేళ్ల బాలిక మృతి చెందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గత రాత్రి చిన్నారి తన తండ్రి చేతుల్లో నుండి జారిపడి పోయింది. గందరగోళం మధ్య ఉత్సవ రథ చక్రం చిన్నారిపై నుంచి వెళ్లడంతో మరణించింది.

పాపను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం తప్పలేదు. రమేశ్, జిజి దంపతుల కుమార్తె క్షేత్రగా గుర్తించారు పోలీసులు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

గతేడాది నవంబర్‌లో రాష్ట్రంలోని కొచ్చిలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (క్యూశాట్)లో జరిగిన ఉత్సవంలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 60 మంది విద్యార్థులు గాయపడ్డారు .

Tags

Read MoreRead Less
Next Story