మద్యం మత్తులో ట్రైన్ ఎక్కిన యువకుడు.. సీనియర్ సిటిజన్లపై మూత్ర విసర్జన

మద్యం మత్తులో ట్రైన్ ఎక్కిన యువకుడు.. సీనియర్ సిటిజన్లపై మూత్ర విసర్జన
మద్యం మత్తులో ఉంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అన్న స్పృహ కూడా ఉండదు మందు బాబులకి.

మద్యం మత్తులో ఉంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అన్న స్పృహ కూడా ఉండదు మందు బాబులకి.ఇక్కడ ట్రైన్ ఎక్కిన ఓ యువకుడైతే అది బాత్ రూమ్ అనుకున్నాడో ఏమో బెర్త్ మీద ఉండే యూరిన్ చేశాడు. దాంతో కింద బెర్త్ మీద ఉన్న సీనియర్ సిటిజన్ల మీద పడడంతో పాపం వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ల లగేజీ కూడా తడిచిపోయింది. యువకుడు చేసిన ఈ నిర్వాకం యూపీ రైలులో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ యొక్క AC కోచ్‌లో ప్రయాణిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఈ పరిస్థితి ఎదురైంది. బి3 కోచ్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలు విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ వైపు వెళుతుండగా, 57 మరియు 60 బెర్త్‌లలో ఉన్న బాధితులు తమపై మూత్రం పడుతుండడంతో షాక్‌కు గురయ్యారు.

దిల్లీకి వెళుతున్న మేము మా ప్రయాణం సజావుగా సాగుతుందని అనుకున్నాము. ఇలా మాపై మూత్ర విసర్జన చేస్తారని మేము కలలో కూడా అనుకోలేదు" అని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రిటైర్డ్ ఆర్థోపెడిక్ అయిన ప్రయాణీకుడు అన్నారు. ఆ క్షణంలో మా ప్రయాణం నరకంగా అనిపించిందని అన్నారు.

నిందితుడు నైరుతి ఢిల్లీలోని కుతుబ్ విహార్‌కు చెందిన రితేష్‌గా గుర్తించారు. అతను మహోబాలో రైలు ఎక్కాడు. రితేష్ లోయర్ బెర్త్ నంబర్ 63లో ప్రయాణిస్తున్నాడు.

"మద్యం మత్తులో ఉన్న అతడు మాపై, మా వస్తువులపై మూత్ర విసర్జన చేసిన తర్వాత, తోటి ప్రయాణికులు కోచ్ అటెండర్ మరియు TTEని అప్రమత్తం చేశారు. నిందితుడిని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో దించి రైల్వే సిబ్బందికి అప్పగించారు".

TTE బస్రుద్దీన్ ఖాన్ వెంటనే కోచ్‌ను శానిటైజ్ చేయడానికి హౌసింగ్ కీపింగ్ సిబ్బందిని పిలిచారు. అనంతరం జరిగిన ఘటనపై ఆర్పీఎఫ్ ఝాన్సీకి మెమో ఇచ్చి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం రితేష్‌ను ఎంక్వైరీ చేస్తున్నారు. "నిందితుడైన రితేష్‌పై రైల్వే చట్టం 145 (మద్యపానం లేదా ఇబ్బంది) కింద కేసు నమోదు చేయబడింది" అని ఉత్తర మధ్య రైల్వేలోని ఝాన్సీ డివిజన్ PRO మనోజ్ సింగ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story