AAP: ఉమ్మడి పౌరస్మృతికి సూత్రప్రాయంగా మద్దతు

AAP: ఉమ్మడి పౌరస్మృతికి సూత్రప్రాయంగా మద్దతు
AAP యూనిఫాం సివిల్‌ కోడ్‌కు తమ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు ఇస్తుందని ప్రకటించింది.

ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. మోదీ వ్యాఖ్యలు విభజన రాజకీయాల్లో భాగమంటూ కాంగ్రెస్‌, డీఎంకే, ఎంఐఎం విరుచుకుపడ్డాయి.అయితే ఆప్‌ మాత్రం భిన్నంగా స్పందించింది.యూనిఫాం సివిల్‌ కోడ్‌కు తమ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు ఇస్తుందని ప్రకటించింది. కానీ, అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలని పేర్కొంది.

ఉమ్మడి పౌరస్మృతికి ఆమ్‌ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపుతోందని తెలిపింది.ఆర్టికల్‌ 44 అదే విషయాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి అంశాలపై ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని విశ్వసిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, రాజకీయేతర సంస్థలతోపాటు అన్ని భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వం విస్తృత సంప్రదింపులు జరపిన తర్వాతే UCCని అమలు చేయాలంటోంది.

Tags

Read MoreRead Less
Next Story