19 ఏళ్ల యువతితో ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి.. తండ్రి ఆత్మహత్యాయత్నం

19 ఏళ్ల యువతితో ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి.. తండ్రి ఆత్మహత్యాయత్నం

తమిళనాడులో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే డిగ్రీ చదువుతోన్న యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఈ పెళ్లి ఇష్టం లేని వధువు తండ్రి ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం కల్లకూరిచి నియోజకవర్గానికి చెందిన ప్రభు (35), డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న ఎమ్మెల్యేను వివాహం చేసుకున్నారు. అయితే తన కుమార్తెను కిడ్నాప్ చేసి బలవంతంగా ఎమ్మెల్యే.. పెళ్లి చేసుకున్నాడని వధువు తండ్రి స్వామినాధన్ ఆరోపిస్తున్నారు. తన కుమార్తెను తనతో పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు.పోలీసులు అప్రమత్తమై స్వామినాధన్ ను నిలువరించారు. మరోవైపు తన ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నానని అమ్మాయి చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story