Amit shah : ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా

Amit shah : ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా

ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలకు ముందు పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలులోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2019లో రూపొందించిన ఈ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలు చేస్తామని షా చెప్పారు. "మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. (సీఏఏకు వ్యతిరేకంగా) రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు" అని అమిత్ షా వివరించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల గురించి అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినందున భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి దేశ ప్రజలు 370 సీట్లు.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ మొత్తం 400సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఫలితాలపై ఎలాంటి సస్పెన్స్‌ లేదు. తాము కుటుంబ నియంత్రణను నమ్ముతాము కానీ రాజకీయాల్లో కాదని, సార్వత్రిక ఎన్నికలకు ముందు మరిన్ని పార్టీలు ఎన్‌డీఏలో చేరే సూచనను ఇస్తూ అమిత్ షా అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story