Anand Mahindra: రియల్‌ ‘12th Fail’ జంటతో ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra: రియల్‌ ‘12th Fail’ జంటతో ఆనంద్‌ మహీంద్రా
ఇంటికెళ్లి మరీ ఆటోగ్రాఫ్

నిత్యం అనేక అంశాలపై ట్వీట్ చేస్తూ వార్తల్లో ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఉంటారు. ఆనంద్ మహీంద్రా ఇవాళ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఆయన భార్య, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని శ్రద్ధా జోషిని కలుసుకుని వారి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

మనోజ్ శర్మ (Manoj Sharma), శ్రద్ధా జోషి (Shraddha Joshi) జీవిత కథ ఆధారంగా ’12th ఫెయిల్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ నిజ జీవిత కథ.. విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతే కాకుండా సినీ విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ, ఆయన భార్య ఐఆర్ఎస్ శ్రద్ధా జోషి గురించిన వార్తలు ప్రస్తుతం గత కొన్ని రోజులుగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఇటీవలె 12th ఫెయిల్ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఏడాదిలో ఒకే సినిమా చూడాలని అనుకునేవారు ఈ 12th ఫెయిల్ సినిమాను చూసేయొచ్చని తెలిపారు. అయితే తాజాగా రియల్ 12th ఫెయిల్ దంపతులు మనోజ్ కుమార్ శర్మ, శ్రద్ధా జోషిని మహీంద్రా లంచ్ సమయంలో కలుసుకున్నారు. వారిని “నిజ జీవిత హీరోలు”గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. వారితో దిగిన ఫొటోను షేర్ చేశారు. వారి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు వివరించారు.

తాను ఆటోగ్రాఫ్‌ అడిగినప్పుడు వారు మొహమాట పడ్డారని, తాను మాత్రం చాలా గర్వపడుతున్నానని తెలిపారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలన్న తత్వాన్ని వారు ఫాలో అవుతున్నారని చెప్పారు. ఇలాగే భారతీయులు ఉంటే దేశం మరింత వేగంగా ప్రపంచశక్తిగా మారుతుందని అన్నారు. వారి ఆటోగ్రాఫ్‌ తనకు వారసత్వ సంపద అని ఆయన అన్నారు.


ప్రస్తుతం మనోజ్ కుమార్ శర్మ డిప్యుటేషన్ మీద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-సీఐఎస్ఎఫ్‌ విభాగంలో ఏవియేషన్ సెక్యూరిటీ వింగ్‌లో సేవలు అందిస్తున్నారు. మనోజ్ కుమార్ శర్మ, శ్రద్ధా జోషిల నిజ జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఈ 12th ఫెయిల్ సినిమాను తెరకెక్కించారు. యూపీఎస్‌సీలో విజయం సాధించి.. ఐపీఎస్ కావడానికి ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన, 12వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ఈ 12th ఫెయిల్ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్ర పోషించిన విక్రాంత్ మాస్సే.. అద్భుత నటనతో ప్రశంసలు పొందారు. ఆయనకు, ఈ చిత్రానికి ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి.

Tags

Read MoreRead Less
Next Story