చేతులు లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్.. ఆసియాలోనే మొదటి మహిళగా రికార్డ్

చేతులు లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్.. ఆసియాలోనే మొదటి మహిళగా రికార్డ్
హేళన చేసిన వాళ్లే నివ్వెరపోయేలా చేసింది. అన్ని అవయవాలు ఉన్నవారు కూడా వెనుకడుగు వేసే రంగంలోకి కాలు పెట్టింది. కాలితోనే స్టీరింగ్ తిప్పి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

హేళన చేసిన వాళ్లే నివ్వెరపోయేలా చేసింది. అన్ని అవయవాలు ఉన్నవారు కూడా వెనుకడుగు వేసే రంగంలోకి కాలు పెట్టింది. కాలితోనే స్టీరింగ్ తిప్పి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

కేరళలోని ఇడుక్కికి చెందిన జిలుమోల్ మేరియట్ థామస్ తన ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది. లైసెన్సు పొందిన ఆసియా తొలి మహిళగా కేరళ ప్రభుత్వం ఆమెను సత్కరించింది.

జిలుమోల్ ఫోర్-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనే ఆశతో కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిసెంబర్ 3న పాలక్కాడ్‌లో ఆమెకు స్వయంగా లైసెన్స్‌ని అందజేశారు. థామస్ పాదాలతో స్టీరింగ్ తిప్పుతుంది. గేర్లు మార్చడానికి, ఆపరేటింగ్ కోసం వాయిస్ ఆదేశాల ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది.

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన థామస్ పుట్టుకతో వచ్చే జన్యపరమైన రుగ్మతల కారణంగా చేతులు లేకుండా జన్మించింది. ఆమె కొచ్చిలోని ప్రముఖ ఆర్ట్ పబ్లిషింగ్ హౌస్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. డ్రైవింగ్ పై ఉన్న మక్కువతో డ్రైవింగ్ స్కూల్ లో జాయిన్ అయింది. స్టేట్ కమీషన్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ మరియు కొచ్చిలోని ఒక ప్రైవేట్ సంస్థ సహాయంతో లైసెన్స్ పొందిన డ్రైవర్ కావాలనే ఆమె కల శనివారం నెరవేరింది.

ఈ ఫీట్ సాధించడానికి థామస్ కి ఆరేళ్లు పట్టింది. జిలుమోల్ ఎప్పుడూ కారు నడపాలని కలలు కనేది. ముఖ్యంగా తన తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత, ఆమె స్వతంత్రంగా బతకడం కోసం దారులు వెతుక్కుంది. అందులో భాగంగానే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంది. వదుతలలోని మరియ డ్రైవింగ్ స్కూల్‌లో డ్రైవింగ్ నేర్చుకుంది. లైసెన్స్ కోసం ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ RTOని ఆశ్రయించింది. RTO అధికారులు ఆమె అభ్యర్థనను తిరస్కరించారు, దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది.

కోర్టు జోక్యం తర్వాత, థామస్ ఒక పరీక్షలో పాల్గొని, MVD అధికారుల ముందు మోడిఫైడ్ కారును నడిపింది. అయినా అధికారులు ఆమెకు లైసెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె చివరకు రాష్ట్ర వికలాంగుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఇండోర్‌కు చెందిన విక్రమ్ అగ్నిహోత్రి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశంలో చేతులు లేని మొదటి వ్యక్తి అని కమిషన్ ఉదాహరణగా పేర్కొంది.

దీన్ని అనుసరించి, ఆమె ఎట్టకేలకు ఈ సంవత్సరం లైసెన్స్ పొందగలిగింది. ఇప్పుడు నేను లైసెన్స్ పొందినందుకు చాలా సంతోషిస్తున్నాను. జిలుమోల్ పట్టుదల ఎందరికో స్ఫూర్తి. ఆమెకు డ్రైవింగ్ నేర్పించిన శిక్షకులు కూడా ఆమె పట్టుదలకు గర్వపడుతున్నారు. "మేము ఆమెకు డ్రైవింగ్ నేర్పించేటప్పుడు ఆత్మవిశ్వాసంతో లేము, కానీ ఆమె తన పట్టుదల, సంకల్పం, నిబద్ధత ద్వారా మా ఆలోచనలు తప్పు అని నిరూపించింది. ఆమె సాధిస్తుంది అని మేము త్వరలోనే గ్రహించాము అని డ్రైవింగ్ స్కూల్ యజమాని జోపాన్ చెప్పారు.

కొచ్చిలోని Vi Innovations Pvt Ltd ద్వారా ఆమెకు మద్దతు లభించింది, ఆమె 2018 మారుతి సెలెరియోకు అవసరమైన ఎలక్ట్రానిక్ సర్దుబాట్లను చేయడానికి సహాయక సాంకేతికతను జోడించింది. వైపర్లు,హెడ్‌ల్యాంప్‌లను ఆపరేటింగ్ చేయడానికి వాయిస్ కమాండ్‌ల-ఆధారిత సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఆమెకు Vi సహాయపడింది.

Tags

Read MoreRead Less
Next Story