ఆదాయానికి మించి ఆస్తులు.. విద్యాశాఖ మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష

ఆదాయానికి మించి ఆస్తులు.. విద్యాశాఖ మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే మంత్రి కె పొన్ముడికి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. కోర్టు పొన్ముడికి, అతని భార్యకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా విధించింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే మంత్రి కె పొన్ముడికి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. కోర్టు పొన్ముడికి, అతని భార్యకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా విధించింది. రూ. 1.75 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడికి మద్రాస్ హైకోర్టు గురువారం 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించింది.

మంగళవారం, మద్రాస్ హైకోర్టు ఈ కేసులో పొన్ముడి, అతని భార్యను దోషులుగా నిర్ధారించింది. వారిని నిర్దోషులుగా విడుదల చేసిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది. పొన్ముడి (72) డీఎంకే నేతృత్వంలోని హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తనకు తెలిసిన ఆదాయ వనరుల కంటే 65.99% ఎక్కువ తన పేరు మీద మరియు అతని భార్య పేరు మీద రూ.1.75 కోట్ల వరకు అసమానంగా ఆస్తులు కూడబెట్టుకున్నారనే కేసుకు సంబంధించినది తీర్పు వెలువరించింది.

అయితే, వారిని 2016లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మంగళవారం, హైకోర్టు ఆ తీర్పును పక్కన పెట్టింది. అవినీతి నిరోధక చట్టం, 1988 ప్రకారం శిక్షార్హమైన నేరం నిందితులిద్దరిపై రుజువు చేయబడిందని పేర్కొంది. "నమ్మకమైన సాక్ష్యాలను విస్మరించడం, సాక్ష్యాలను తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా ట్రయల్ కోర్టు నిర్ధోషులుగా తీర్పు చెప్పిందని అని జస్టిస్ జయచంద్రన్ పేర్కొన్నారు.

“నిర్దోషిగా విడుదల చేయడానికి ట్రయల్ కోర్టు ఇచ్చిన అసమంజసమైన కారణాలు, ట్రయల్ కోర్టు తీర్పు కచ్చితంగా తప్పు, నిస్సందేహంగా నిలకడలేనిది అని మద్రాస్ హైకోర్టు పేర్కొని వారిని దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష, జరిమానా విధించింది.

Tags

Read MoreRead Less
Next Story