డబ్బులు ఊరికే రావు.. మరి చెత్తకుప్పలోకి రూ.25 కోట్లు ఎలా?

డబ్బులు ఊరికే రావు.. మరి చెత్తకుప్పలోకి రూ.25 కోట్లు ఎలా?
చెత్తకుప్పలో చెత్త ఏరుకునే వ్యక్తి సల్మాన్ కి ఓ బరువైన సంచి దొరికింది. అందులో ఏమున్నాయో అని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.

చెత్తకుప్పలో చెత్త ఏరుకునే వ్యక్తి సల్మాన్ కి ఓ బరువైన సంచి దొరికింది. అందులో ఏమున్నాయో అని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. అవి అమెరికన్ కరెన్సీ ఏం చేయాలో తెలియక ఆ బ్యాగును ఇంటికి తీసుకువెళ్లాడు. డబ్బుతో పాటు, ప్లాస్టిక్ సంచిలో ఐక్యరాజ్యసమితి ముద్రతో కూడిన లేఖ కూడా అందులో ఉంది.

బెంగళూరులోని అమృతహళ్లికి చెందిన 39 ఏళ్ల చెత్త ఏరుకునే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం నగరంలోని నాగవార రైల్వే స్టేషన్‌ చుట్టుపక్కల ఉన్న వ్యర్థ వస్తువుల మధ్య చెత్త సేకరిస్తున్నప్పుడు అందులో 3 మిలియన్ డాలర్లు ( ₹ 25 కోట్లు) ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించింది.

దానిని తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని స్క్రాప్ డీలర్ బప్పాకు తెలియజేశాడు. డబ్బు నీ దగ్గరే ఉంచుకో అని బప్పా సల్మాన్ కి చెప్పాడు. అయితే, సల్మాన్ అంత డబ్బు తన దగ్గర ఉండడం మంచిది కాదని, అదీకాక అవి అమెరికన్ డాలర్లు కావడంతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఆదివారం స్వరాజ్ ఇండియాకు చెందిన సామాజిక కార్యకర్త కలీమ్ ఉల్లాను సంప్రదించి విషయాన్ని వివరించాడు.

ఈ విషయాన్ని కరీం ఉల్లా నగర పోలీసు కమిషనర్ బి దయానందకు తెలియజేశారు. కమీషనర్ వెంటనే హెబ్బాల్ పోలీసులను పిలిచి సంఘటనా స్థలాన్ని పరిశీలించవలసిందిగా కోరారు” .

దక్షిణ సూడాన్‌లోని UN శాంతి పరిరక్షక దళాలకు సహాయం చేయడానికి భద్రతా మండలి సభ్యులచే ఓటు వేయబడిన ఆర్థిక కమిటీ ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది" అనేది లేఖలోని సారాంశం.

ఉగ్రవాదుల బారి నుంచి నోట్లను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి వాటిపై లేజర్ స్టాంప్‌ను ఉంచడానికి ఐక్యరాజ్యసమితి ఫైనాన్స్ కమిటీకి అధికారం ఇచ్చింది. డాలర్ లు నకిలీవిగా కనిపించాయని, అందువల్ల వాటిని సమగ్ర విచారణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపామని హెబ్బాల్ తెలిపారు. ఈ నోట్లపై కొన్ని రకాల రసాయనాలను పూసినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్‌ డాలర్‌ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకి చెందిన వారు ఈ కరెన్సీ నోట్లను అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story