ఫ్లైఓవర్‌పై రీల్స్‌ ఆన్‌ వీల్స్‌ చేస్తూ.. ఒకరి మృతికి కారణమైన జంట..

ఫ్లైఓవర్‌పై రీల్స్‌ ఆన్‌ వీల్స్‌ చేస్తూ.. ఒకరి మృతికి కారణమైన జంట..
ఎన్ని చదివినా, ఎన్ని చూసినా ఈ జనం మారరు. కదులుతున్న వాహనంపై విన్యాసాలు చేస్తుంటారు.. ఇప్పుడు కొత్తగా రీల్స్ అని మొదలు పెట్టారు.

ఎన్ని చదివినా, ఎన్ని చూసినా ఈ జనం మారరు. కదులుతున్న వాహనంపై విన్యాసాలు చేస్తుంటారు.. ఇప్పుడు కొత్తగా రీల్స్ అని మొదలు పెట్టారు. ఇవన్నీ ప్రాణాలతో చెలగాటమని తెలిసినా యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం కోసం ఇటువంటి సాహసాలు చేస్తుంటారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.. పాపం కొందరు వీళ్ల వల్ల వాళ్లు చేయని తప్పుకు బలవుతుంటారు. ఇక్కడ జరిగిన సంఘటన అలాంటిదే..

వారణాసి ఫ్లైఓవర్‌పై రీల్స్‌ ఆన్‌ వీల్స్‌ చేస్తున్న ఓ జంట చేసిన స్టంట్‌లో తమ 'బ్రాండ్‌ న్యూ బైక్‌' అదుపు తప్పి బ్రిడ్జిపై పడిపోవడంతో వారి ద్విచక్ర వాహనం కింద ఉన్న కారుపై పడింది. కారు డ్రైవ్ చేస్తున్న సర్వేష్ శంకర్ మృతి చెందాడు. అతని పక్కన కూర్చున్న స్నేహితుడు గాయపడ్డాడు.

రీల్స్ చేసిన ఆ జంటకు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం పొంచి ఉందని తెలిసి అక్కడి నుంచి పరారయ్యారు. బండికి ఎటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ లేదు. దాంతో బైక్‌ను వదిలివేసినట్లు పోలీసులు తెలిపారు. శివపూర్‌లోని గంజరి ప్రాంతంలోని ఫ్లైఓవర్‌ దిగువన ఉన్న అండర్‌పాస్‌ గుండా వెళుతుండగా కారు ఢీకొట్టింది.

బైక్ డివైడర్‌ను ఢీకొట్టి ఫ్లైఓవర్‌లోని ఓపెనింగ్ ద్వారా అండర్‌పాస్‌లోకి దూసుకెళ్లి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు సర్వేష్ శంకర్ రైల్వే ఇంజనీర్. అతని స్నేహితుడు ఆదిత్య వర్మ తీవ్రంగా గాయపడి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. జంట ఎవరనేది నిర్ధారించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ జంట సోషల్ మీడియా రీల్స్‌ను తయారు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story