అతడు నాకు నచ్చలేదు.. నాకొద్దీ పెళ్లి: పీటల మీద నుంచి లేచి వెళ్లిన వధువు

అతడు నాకు నచ్చలేదు.. నాకొద్దీ పెళ్లి: పీటల మీద నుంచి లేచి వెళ్లిన వధువు
గిదేంది గిట్లున్నడు.. నాకొద్దీ పెళ్లి అంటూ పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది వధువు. బంధువులు బతిమాలినా అతగాడిని చేసుకోనంటే చేసుకోను అని మొండికేసింది.

గిదేంది గిట్లున్నడు.. నాకొద్దీ పెళ్లి అంటూ పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది వధువు. బంధువులు బతిమాలినా అతగాడిని చేసుకోనంటే చేసుకోను అని మొండికేసింది. దాంతో చేసేదేం లేక పెళ్లి క్యాన్సిల్ చేశారు తల్లిదండ్రులు. పీటల మీద పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతున్నాయంటే సవాలక్ష కారణాలు.. ఎక్కువగా కట్నం డబ్బు ముట్టలేదని మూడు ముళ్లు వేయడానికి నానా యాగి చేసే ఘటనలు కోకొల్లలు. కానీ పెళ్లికి ముందే సగం తంతు పూర్తవుతున్న ఈ రోజుల్లో కళ్యాణ మండపంలోకి అడుగు పెడుతున్న వరుడిని చూసి తాను ఊహించుకున్న కలల రాకుమారుడులా లేడని వధువు రిజెక్ట్ చేసింది.

బిహార్ రాష్ట్రం బాగల్ పూర్ లోని కహల్ గావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వధువు కిట్టూ కుమారి వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే పెద్దగా కనిపిస్తున్నాడని చెప్పి నిరాకరించింది. ఊరేగింపుగా వచ్చి కళ్యాణ మండపంలోకి అడుగు పెడుతున్న వరుడుని చూసి వధువు మొహం చిట్లించింది. కాబోయే వాడిని చూసి సిగ్గుల మొగ్గవ్వాల్సి వధువు మొహం ఏంటి ఇంత కోపంగా ఉంది అనుకున్నారు పెళ్లికి వచ్చిన అతిధులంతా. నా కొద్దీపెళ్లి, అతడు నాకు నచ్చలేదు అని చెప్పేసరికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇదేం చోద్యమే తల్లి అని మాట్లాడుకున్నారు. వరుడి కుటుంబసభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు పలు హామీలు ఇచ్చారు. అయినా ససేమిరా అంది. మరింత మొండిగా ప్రవర్తించింది. చివరకు వివాహాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story