Tamil nadu: పాట పెట్టారు - ఫైన్ కట్టారు

బస్సులో పెద్ద సౌండ్ తో పాటలు పెట్టినందుకు ఫైన్ కట్టిన ప్రైవేట్ బస్ డ్రైవర్, కండక్టర్

అతి అనర్ధ దాయకం అన్న విషయం మనకు తెలుసు అయినా సరే అప్పుడప్పుడు అలా చేసి అడ్డంగా దొరికిపోతుంటాం పాపం అలాగే బుక్ అయ్యాడు ఓ బస్ డ్రైవర్. పనిలో ఉత్సాహం కోసం బస్సులో అతను పెట్టుకున్న పాటల సౌండ్ అధికంగా ఉండడంతో కోర్టు అతనికి పదివేల రూపాయలు జరిమానా విధించింది.





అదొక తమిళనాడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. దాంట్లో చాలామంది ప్రయాణీకులు ఉన్నారు. బస్సు నిండిపోయింది. సో ఇక హాపీ గా స్టార్ట్ చేసేలోపు పాటలు ప్లే చెయ్యడం మొదలు పెట్టారు పెట్టారు డ్రైవరు, కండక్టరు. బస్సులో రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళందరికీ ఇది అలవాటే. అదే బస్సులో కాంచీపురం జిల్లా కోర్టు న్యూయమూర్తి సెమ్మల్ కూడా ప్రయాణీస్తున్నారు. పాటలు సౌండ్ మరీ పెద్దగాతో ఉండటంతో కాస్త తగ్గించాలని న్యాయమూర్తి కండక్టర్, డ్రైవర్లను కోరారు. కానీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకరిద్దరు న్యాయమూర్తిని సపోర్ట్ కూడా చేశారు. రెండు మూడు సార్లు సౌండ్ తగ్గించమని అడిగారు. అబ్బే తగ్గేదేలే అన్నారు వాళ్ళు.. దీంతో న్యాయమూర్తి కాంచీపురం పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు కాంచీపురం మూంగిల్‌ మంటపం వద్దకు చేరుకొని బస్సును అడ్డుకొన్నారు. ఉత్సాహం కోసం పాటలు పెట్టడం వరకు సరే..గానీ సౌండ్ అంతగా బిగ్గరగా పెట్టటం పైనా, సౌండ్ తగ్గించమని కోరినా పట్టింకోకపోవటం పైనా మండిపడ్డారు. ఇంత పెద్ద సీన్ జరిగిన తరువాత బస్సులో సౌండ్ తగ్గించమని కోరిన వ్యక్తి న్యాయమూర్తి అని తెలిసిన కండక్టరు, డ్రైవరు క్షమాపణలు చెప్పారు.

ప్రయాణీకులను గమ్యానికి చేర్చటమే కాదు, వారి ప్రశాంతతకు ఇబ్బంది కలగకుండా చూడటం కూడా డ్రైవర్ బాధత అని చెప్పిన న్యాయమూర్తి సెమ్మల్, కండక్టరు, డ్రైవర్‌కు బస్సు యజమానికి రూ.10 వేలను జరిమానా విధించి, ప్రయాణికుల భద్రతపై కండక్టరు, డ్రైవరు దృష్టి సారించాలని..ఇంకెప్పుడు ఇలా చేయవద్దని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story