Justin Trudeau: ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని

Justin Trudeau: ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని
కదలనుంటున్న డొక్కు విమానం

రెండు రోజులు జీ20 సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే తమ దేశాలకు చేరుకున్నారు. అయితే సమ్మిట్ ముగిసినప్పటికీ కెనడా ప్రధాని, ఆయన టీం ఇక్కడే ఉండిపోయింది. ట్రూడో వ‌చ్చిన విమానం దెబ్బ‌తిన‌డంతో.. ఆయ‌న తిరుగు ప్ర‌యాణం మొదలు అవ్వలేదు.విమానంలో సాంకేతిక లోపం త‌లెత్త‌డం వ‌ల్లే .. ట్రూడో ఇండియాలో ఉండిపోయిన‌ట్లు తెలుస్తోంది. అయితే కెన‌డా నుంచి బ్యాక‌ప్ ప్లేన్ కోసం ఆయ‌న ఎదురుచూస్తున్నారు. ఆ దేశం నుంచి మ‌రో విమానం ఇండియాకు రానున్న‌ది. లేదంటే ఆయ‌న వ‌చ్చిన విమానాన్ని రిపేర్ చేసి పంపాల్సి ఉంటుంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ట్రూడో విమానం.. కెన‌డాకు ప‌య‌నం అయ్యే ఛాన్సు ఉన్న‌ట్లు ఆ దేశ సెక్యూర్టీ ద‌ళాలు పేర్కొంటున్నాయి.


కెనడా ప్రధాని, ఉన్నతాధికారులు 1980ల నాటి ఎయిర్‌బస్ ఏ310 విమానంలో భారత్ లోని జీ20 సదస్సుకు వచ్చారు. ఈ క్రమంలోనే కెనడా ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఆ డొక్కు విమానం ఇంధనం కోసం అలస్కార, జపాన్ లలో ఆగింది. దీని బట్టే కెనడా ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి విమానాలు అవి మాత్రమే కాకుండా ఒట్టావాలోని దేశ ప్రధాని అధికార నివాసం కూడా దారుణ పరిస్థితుల్లో ఉంది. 2015 ఎంపిక అయినప్పటి నుంచి ట్రూడో అక్కడ ఉండలేదు. దాని మరమ్మత్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు.

మరోవైపు కెనడాను అడ్డాగా చేసుకొని ఖలిస్థాన్ వేర్పాటువాదులు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. భారత్‌పై విద్వేషం చిమ్మేలా ఖలిస్థాన్ వేర్పాటువాదులు వ్యవహరిస్తుండగా.. వారి ఆగడాలను కెనడా ప్రభుత్వం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు కోసం భారత్‌కు వచ్చిన జస్టిన్ ట్రూడో‌ను ప్రధాని మోదీ బాహాటంగానే విమర్శించారు. మీ దేశం వేదికగా భారత్ వ్యతిరేక కార్యకాలపాలు జరుగుతున్నాయన్నారు. జీ20 సదస్సు సందర్భంగా కెనడా ప్రధానితో ద్వైపాక్షిక సమావేశానికి కూడా భారత్ పెద్దగా ఇష్టపడలేదు. కాకపోతే కాసేపు ఇరు దేశాల ప్రధానులు మాట్లాడుకున్నారు.


ఇక ప్రస్తుతం ట్రూడో భారత్ నుంచి వెళ్లాలి అంటే ఈ పాత విమానం అయిన బాగుపడాలి లేదంటే అక్కడి నుంచి ఇంకో విమానం వచ్చి అయినా వారిని ఎక్కించుకొని వెళ్లాలి. అయితే తమ టీంను తొందరగానే ఇండియా నుంచి తీసుకువెళతామని కెనడా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నానానికి కానీ, రేపు కానీ ట్రూడో టీం తమ దేశానికి చేరుకునే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story