ఆమెను ఆంటీ అని పిలిచాడు.. అంతే అడ్డంగా బుక్కయ్యాడు..

ఆమెను ఆంటీ అని పిలిచాడు.. అంతే అడ్డంగా బుక్కయ్యాడు..
ఆంటీ అనిపిలిస్తే అందరికీ నచ్చదు.. తమ వయసు మరీ అంత ఎక్కువేం కాదని, ఆంటీ అని పిలిపించుకునేంత పెద్దవాళ్లం కాదని కొందరు మహిళలు భావిస్తుంటారు.

ఆంటీ అనిపిలిస్తే అందరికీ నచ్చదు.. తమ వయసు మరీ అంత ఎక్కువేం కాదని, ఆంటీ అని పిలిపించుకునేంత పెద్దవాళ్లం కాదని కొందరు మహిళలు భావిస్తుంటారు. ఆంటీ అని పిలిస్తే చిర్రెత్తుకొస్తుంది వాళ్లకి.

తమిళనాడు వాషర్‌మెన్‌పేటకు చెందిన 57 ఏళ్ల నిర్మలాదేవి బస్సు ఎక్కింది. టికెట్ ఇవ్వడానికి వచ్చిన కండక్టర్ ఆమెను ఆంటీ ఎక్కడికి వెళ్లాలి అన్నాడు.. అంతే ఆమె అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. నన్ను ఆంటీ అంటావా.. నా వయసెంత అనుకున్నావు.. ఏం నీ కంటికి నేను అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా అని అతడి మీద విరుచుకుపడింది.

అయ్యో ఆంటీ నా ఉద్దేశం అది కాదు.. అని మళ్లీ ఆంటీ అని పిలిచినందుకు నాలిక్కరుచుకుని సారీ మేడం అని సర్ధి చెప్పడానికి ప్రయత్నించాడు.. అయినా ఆమె వింటేగా.. వెంటనే భర్తకు కాల్ చేసి నెస్ట్ స్టాప్ కి వచ్చేయమంది. భర్తతో కలిసి రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కండక్టర్ కార్తీక్ మీద కంప్లైంట్ ఇచ్చింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు రాసిన పోలీసులు విచారిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story