అమ్మో అమ్మాయేనా.. ఆరువేల పాముల్ని..

అమ్మో అమ్మాయేనా.. ఆరువేల పాముల్ని..
దాదాపు అందరికీ పాములంటే భయం. వాటిని చూస్తే చాలా ఒళ్లంతా కంపించినట్లవుతుంది.

దాదాపు అందరికీ పాములంటే భయం. వాటిని చూస్తే చాలా ఒళ్లంతా కంపించినట్లవుతుంది. ఎక్కడైనా కనిపిస్తే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాం.. కానీ ఆమె పాముని ఎవరైనా చంపేస్తారేమో అని దాన్ని రక్షించడానికి పరిగెడుతుంది.

చెన్నైలో ఎక్కడ పాము కనిపించినా వేదప్రియ గణేశన్ కు కాల్ వెళిపోతుంది. సహాయం కోసం ఆమెను ఆశ్రయిస్తారు. పాములు పట్టడంలో మూడు సంవత్సరాల అనుభవం ఉన్న వేదప్రియ ఇప్పుడు తమిళనాడు ఫైర్ & రెస్క్యూ సర్వీసెస్ (TNFRS) కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో అయితే ఆమెకు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు.

TNFRSలో, ఆమె స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మొదటి మహిళ వేద ప్రియ. పాములు పట్టే వ్యక్తినని చెప్పుకుంటూ, పాము పట్టడంలో తన మెళకువలను పంచుకుంటుంది. ఇతర సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తుంది."ఎక్కడైనా పాము కనిపించిందని కాల్ వస్తే మీరు దానిని ఏమీ చేయవద్దు.. వచ్చేస్తున్నాము అన్నా వినకుండా పాముని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఎవరూ ఏమీ చేయకుండా దాని దారిన దాన్ని వదిలేస్తే వెళ్లిపోతుంది. కానీ అలా చేయరు.. చంపాలని అనుకుంటారు.

ఎవరైనా పామును గుర్తించినట్లయితే, అది విషరహితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివాసితులు తెలుసుకోవాలని వేదప్రియ కోరుకుంటున్నారు. చెన్నైలో కనిపించే 30 రకాల పాముల్లో నాలుగు మాత్రమే విషపూరితమైనవని ఆమె తెలిపారు. సాధారణంగా అందరూ అనుకునేది పాములు విషపూరితమైనవని. కానీ అది సరికాదు అని అంటారు వేద ప్రియ.'పాములను తాకకుండా కూడా రక్షించవచ్చు' అని చెబుతుంది.

ఒకసారి వర్షపు నీటి నిల్వ ట్యాంక్‌లో చిక్కుకున్న పామును రక్షించేందుకు వేదప్రియను పిలిచారు స్థానికులు. ట్యాంక్ లోపలికి దిగిన తర్వాత అది నాగుపాము అని ఆమె గ్రహించింది. దానికి హాని కలిగించకుండా బయటకు తీశాను. అది కూడా నన్ను ఏమీ చేయలేదు.

పాము ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, ప్రజలు అన్ని తలుపులు, కిటికీలను తెరవాలి. పాము పట్టే వ్యక్తి అక్కడికి చేరుకునే వరకు పామును ఇబ్బంది పెట్టకూడదు. సరిగ్గా ప్రయత్నిస్తే పామును తాకకుండా కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించవచ్చు అని ఆమె తెలిపింది. ఇప్పటి వరకు ఆరు వేల పాముల్ని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వివరించింది.

ఆమె సరీసృపాలతో తన సంబంధాన్ని వివరిస్తూ.. మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను వివరించింది. “ ఒక నాగుపామును కొట్టి చంపడానికి సిద్ధమవుతున్న వ్యక్తులను చూశాను. అప్పుడు నాకు అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఆ పామును పట్టుకుని ఒక రంధ్రం దగ్గర వదిలివేసాను. " దానిని అక్కడ వదిలిపెట్టినప్పుడు, అది దాని మార్గంలో వెళ్తుందని అనుకున్నాను. కానీ అది పొదల్లోకి జారిపోయే ముందు తిరిగి నా దగ్గరకు వచ్చింది. అప్పుడే అనుకున్నాను.. పాములను సంరక్షించాలని అని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంది వేద ప్రియ.

Tags

Read MoreRead Less
Next Story