9వ తరగతి విద్యార్థికి గుండెపోటు.. క్లాస్‌లోనే కుప్పకూలి..

9వ తరగతి విద్యార్థికి గుండెపోటు.. క్లాస్‌లోనే కుప్పకూలి..
గుండెపోటుకు వయసు తారతమ్యం లేకుండా పోతుంది.

గుండెపోటుకు వయసు తారతమ్యం లేకుండా పోతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్నారులు సైతం గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఒకప్పుడు వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చే జబ్బులు ఇప్పుడు చిన్న వయసు వారిని సైతం కబళిస్తున్నాయి.

లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్ అలీగంజ్ క్యాంపస్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తన కెమిస్ట్రీ క్లాస్‌లో కుప్పకూలి మరణించాడు. అతిఫ్ సిద్ధిఖీ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వెంటనే వైద్యసేవలు అందించినప్పటికీ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. ఇటీవల తన 14వ పుట్టినరోజు జరుపుకున్న అతిఫ్ మంచి విద్యార్థి అని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ దుర్ఘటనతో పాఠశాల, విద్యార్థి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కెమిస్ట్రీ టీచర్ నదీమ్ ఖాన్ క్లాస్ తీసుకుంటుండగా, అతిఫ్ స్పృహతప్పి పడిపోయాడు. దీంతో విద్యార్థులు అలారం మోగించారు. ఆసమయంలో ఉపాధ్యాయుడు మరో విద్యార్థి డౌట్ ని పరిష్కరిస్తున్నారు. ఉపాధ్యాయుడు వెంటనే అతిఫ్ సీటు వద్దకు వెళ్లి అతడిని తన చేతుల్లోకి తీసుకుని, అతని గుండెను పంప్ చేసి, నోటి నుండి నోటికి ఆక్సిజన్ అందించారు. అయినా అతడు స్పృహలోకి రాలేదు.

పాఠశాల యాజమాన్యం నర్సును పిలిచి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుండి అతన్ని KGMUకి రిఫర్ చేశారు" అని ఖాన్ చెప్పారు.అప్పటికే అతడి తండ్రికి కూడా సమాచారం అందించడంతో అతను కూడా ఆసుపత్రికి చేరుకున్నాడు" అని ఉపాధ్యాయులు తెలిపారు.

కానీ అప్పటికే అతిఫ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అతిఫ్ తండ్రి మహ్మద్ అన్వర్ సిద్ధిఖీ వ్యాపారవేత్త, తల్లి నిఘత్ గృహిణి. కుటుంబం ఖుర్రంనగర్‌లో నివసిస్తోంది. అతిఫ్‌కు కవల సోదరుడు అయాన్, ఇద్దరు సోదరీమణులు అరీబా, అరుష ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story