Top

భారత్‌లో 50 లక్షలకు చేరువగా కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొసాగుతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో కొత్తగా.. 83 వేల 809 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

భారత్‌లో 50 లక్షలకు చేరువగా కరోనా కేసులు
X

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొసాగుతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో కొత్తగా.. 83 వేల 809 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 49 లక్షల 30 వేలు దాటింది. భారత్‌లో ప్రస్తుతం 9 లక్షల 90 వేల 61 యాక్టివ్‌ కేసులు ఉండగా... ఇప్పటి వరకు 38 లక్షల 59 వేల 400 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్క రోజులో వైరస్‌తో ఒక వెయ్యి 54 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు చనిపోయివారి సంఖ్య 80 వేల 776కి చేరింది. భారత్‌లో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 78.28 శాతం ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ.. కరోనా హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల 77 వేలు దాటింది. అక్కడ తాజాగా మరో 17 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2 లక్షల 91 వేల యాక్టివ్ కేసులు ఉండగా... ఏడున్నర లక్షల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య దాదాపు 30వేలకు చేరుకుంది. కేసుల పరంగా రెండో స్థానంలో ఉన్న ఏపీలో మొత్తం కరోనా కేసులు 5 లక్షల 75 వేలు దాటాయి. 93 వేల యాక్టివ్ కేసులు ఉండగా...4 లక్షల 76 వేల మంది రికవర్ అయ్యారు. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 4 వేల 9వందలు దాటింది. తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 8 వేలు దాటింది. 46 వేల యాక్టివ్ కేసులు ఉండగా...నాలుగున్నర లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. సుమారు ఎనిమిదిన్నర వేల మంది కరోనాతో మృతిచెందారు. దేశంలో ఇప్పటి వరకు 5 కోట్ల 83 లక్షల శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్టు ICMR తెలిపింది.

Next Story

RELATED STORIES