భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా ఉదృతి

భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా ఉదృతి
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 61 వేల 267 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 61 వేల 267 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66 లక్షల 85 వేలు దాటింది. దేశంలో ప్రస్తుతం 9 లక్షల 19 వేల యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 75 వేల 787 మంది కోలుకోగా.. మొత్తం ఇప్పటి వరకు 56 లక్షల 62 వేల మంది కరోనా నుంచి రికవర్‌ అయ్యారు. నిన్న ఒక్క రోజులో కరోనాతో 884 మంది చనిపోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య ఒక లక్షా 3 వేలు దాటింది. నిన్న ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 10 లక్షల 89 వేల శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 8 కోట్ల 10 లక్షలు దాటినట్టు.. ICMR తెలిపింది.

వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనూ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 10 వేల 244 పాజిటివ్ కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 14 లక్షల 53 వేలు దాటింది. మహారాష్ట్రలో ప్రస్తుతం రెండున్నర లక్షల పాజిటివ్ కేసులు ఉండగా... 11 లక్షల 62 వేల మంది రికవర్ అయ్యారు. మహారాష్ట్రలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 38 వేలు దాటింది. 7 లక్షల 23 వేల కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది. అక్కడ 51 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 6 లక్షల 66 వేల మంది రికవర్‌ అయ్యారు. మొత్తం కరోనా మరణాలు 6 వేలు దాటాయి. కార్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ.. వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story