భారత్‌లో ఊరటనిస్తోన్న కరోనా రికవరీ రేటు

భారత్‌లో ఊరటనిస్తోన్న కరోనా రికవరీ రేటు
భారత్‌లో కరోనా రికవరీ రేటు కొంత ఊరటనిస్తోంది. గత రెండు వారాలుగా... రోజూవారి కొత్త కేసుల నమోదు కంటే.. కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా నమోదవుతోంది..

భారత్‌లో కరోనా రికవరీ రేటు కొంత ఊరటనిస్తోంది. గత రెండు వారాలుగా... రోజూవారి కొత్త కేసుల నమోదు కంటే.. కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా నమోదవుతోంది. గత 24 గంటల్లో కొత్త 78 వేల 524 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 83 వేల 11 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 58 లక్షల 27 వేల 705కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 85.25 శాతానికి చేరింది. గత 24 గంటల్లో 971 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య ఒక లక్షా 5 వేల 526కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 9 లక్షల 2 వేల 425 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 68 లక్షల మార్క్‌ దాటింది.

నిన్న ఒక్క రోజులో 11 లక్షల 94 వేల పరీక్షలు నిర్వహించగా... ఇప్పటి వరకు మొత్తం 8 కోట్ల 34 లక్షల టెస్టులు చేసినట్టు.. ICMR తెలిపింది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 14 లక్షల 80 వేలకు చేరింది. ప్రస్తుతం అక్కడ 2 లక్షల 44 వేల యాక్టివ్ కేసులు ఉండగా... దాదాపు 12 లక్షల మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో మరణాల సంఖ్య 39 వేల మార్క్‌ దాటింది.

7 లక్షల 34 వేల కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం అక్కడ 49 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 6 లక్షల 80 వేల మంది కోలుకున్నారు. కర్నాటకలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల్లో అక్కడ కొత్తగా మరో 10 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 68 వేలకు చేరింది. తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షల 35 వేలు దాటింది. అటు కేరళలోనే మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 10 వేల 6 వందల కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story