Deep Fake: డీప్ ఫేక్‌పై ప్రధాని మోదీ ఆందోళన

Deep Fake: డీప్ ఫేక్‌పై  ప్రధాని మోదీ ఆందోళన
అతి పెద్ద ముప్పుగా వ్యాఖ్య

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. కొందరు కావాలని సినిమా హీరోయిన్ల ఫొటోలతో వీడియోలను మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న ఈ వీడియోలు సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫాంలపై దర్శనమిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా సినీ తారల అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. వేరొకరి ముఖాల స్థానంలో రష్మిక మందన్న, కాజోల్ వంటి తారల ముఖాలను మార్ఫింగ్ చేసి రూపొందిస్తున్న ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఉంటున్నాయి. తారలే కాదు.. ప్రధాని లాంటి ప్రజాప్రతినిధులను కూడా డీప్ ఫేక్ తో మార్ఫింగ్ చేసి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఈ సమస్య ఎంత పెద్ద విపత్తుగా మారిందో అర్ధం చేసుకోవచ్చు..

అంతెందుకు, ప్రధాని నరేంద్ర మోదీ ఓ పాట పాడినట్టు డీప్ ఫేక్ వీడియో రూపొందించడం ఇదెంతటి తీవ్రమైన సమస్యో చెబుతోంది. ఇలాంటి వీడియోలపై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని, సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు.

ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ దీపావళి మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ... కొత్త టెక్నాలజీలతో పెరుగుతున్న సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు.

డీప్‌ఫేక్‌ల కోసం కృత్రిమ మేధస్సును దుర్వినియోగం చేసే విషయంలో పౌరులు, మీడియా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో డీప్‌ఫేక్‌లు ఎన్నికల ప్రజాస్వామ్య సమగ్రతకు సవాళ్లను విసురుతున్నాయని.. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, ఫొటోలు నకిలీవా, నిజమైనవా అని గుర్తించడం కష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయినప్పుడు వార్నింగ్ ఇవ్వాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్లు ప్రధాని తెలిపారు. ముందుగా రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా రేపింది. బ్లాక్ యోగా బాడీసూట్ ధరించిన అమ్మాయి.. ముఖం రష్మికగా మార్ఫింగ్ చేశారు. ఆమె నవ్వుతూ ఎలివేటర్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆ తర్వాత కత్రినా కైఫ్ ‘టైగర్ 3’లో టవల్ ఫైట్ సన్నివేశానికి సంబంధించిన మార్ఫింగ్ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కాజోల్‌కి సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. ఇలా డీప్ ఫేక్ వీడియోలు అంతటా దుమారం రేపుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story