Delhi: యమున నదికి భారీ వరద

Delhi: యమున నదికి భారీ వరద
మళ్లీ డేంజర్ లైన్ దాటిన యమున

ఢిల్లీ పరిసరాల్లో యమున నదికి భారీ వరద నీరు పోటెత్తింది. హిమాచల్ ప్రదేశ్,హర్యానా, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా యమున డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీ పరిసరాల్లో 205 మీటర్లకు మించి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ఢిల్లీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన దగ్గర ప్లడ్ 205.33 మీటర్లకు చేరుకుంది. మరోవైపు హర్యానా హత్నీకుండ్ బ్యారేజీ నుంచి 30 వేలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి పరిస్థితి నెలకొంది. మరోసారి వరదలు వచ్చే చాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే యమున నది ప్రాజెక్టుపై ఉన్న గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈరోజు సెలవు ప్రకటించింది.


ముందు జాగ్రత్త చర్యగా లోతట్టుకాలనీలను అధికారులు అలర్ట్ చేశారు. వరద ప్రభావం ఉండచ్చు అనే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అక్కడ ప్రజల్ని సురక్షితప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఒకప్పుడు యయునా నది పవిత్రమైనది, స్వచ్ఛమైనది. కానీ ఇప్పుడు అది కాలుష్యానికి ఆలవాలం. జనాభా పెరగడం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నదీ తీరాన పారిశ్రామికీకరణ విపరీతంగా జరగడంతో నది కాలుష్యం కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది.


మానవ, పారిశ్రామిక వ్యర్ధాలన్నీ నదిలోకి చేరి కాలుష్యానికి యమునా నది కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దిల్లీ సమీపంలో ప్రవహించే ఈ నది నీటిని నేరుగా తాగడం, పంటలకు వాడటం ప్రమాదకరమన్న హెచ్చరిక రిపోర్టులు కూడా వచ్చాయి. మరో వైపు విపరీతంగా కురస్తున్న వర్షాల కారణంగా యమునా నదికి వరద నీరు పెరుగుతోంది. అయితే కాలుష్యం, పెరుగుతున్న కట్టడాలు, ఆక్రమణలు కూడా ఈ వరదలను మరింత ఉదృతం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story