Maharashtra : టీ కోసం ఆపరేషన్ ఆపేసి వెళ్లిపోయిన డాక్టర్

Maharashtra : టీ కోసం  ఆపరేషన్ ఆపేసి వెళ్లిపోయిన డాక్టర్
అనస్థీషియాలోనే పడున్న మహిళలు

ఓ టీ కోసం ఓ డాక్టర్ విచిత్రంగా ప్రవర్తించాడు. మహిళలకు సర్జరీ చేసేందుకు సయయంలో టీ ఇవ్వలేని మధ్యలోనే ఆపరేషన్ థియేటర్ లోంచి బయటకొచ్చేశాడు. అక్కడున్న స్టాఫ్ పై విరుచుకుపడ్డాడు. ఈ డాక్టర్ చేసిన పనికి అప్పటికే మత్తు మందు (అనస్థీషియా)ఇచ్చి పడుకోబెట్టిన మహిళలు అలాగే మత్తులోనే ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది. స్టెరిలేజేషన్ సర్జరీ(వేసక్టమీ)(కుటుంబ నియంత్రణ) మధ్యలో వదిలిసి వెళ్లాడు ఓ డాక్టర్. తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్య నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ప్రభుత్వం ఆస్పత్రిలో 8 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం పిలిచారు. నలుగురు మహిళలకు శస్త్రచికిత్స తర్వాత, డాక్టర్ భాలవి ఆస్పత్రి సిబ్బందిని ఒక కప్పు టీ అడిగాడు, అయితే సిబ్బంది టీ ఇవ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘటన జరిగిన సమయంలో నలుగురు మహిళలు అనస్థీషియా మత్తులో ఉన్నారు. ఆపరేషన్ ముందు వీరికి సాధారణ మత్తు మందు ఇచ్చారు. డాక్టర్ ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన విషయాన్ని మహిళ బంధువులు జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లారు . దీంతో తక్షణం వేరే వైద్యుడిని ఆస్పత్రి కి పంపి ఆపరేషన్లు పూర్తి చేసారు.

అయితే అయితే ఈ ఘటనపై మాట్లాడిన డాక్టర్.. తనకు షుగర్ ఉందని సమయానికి టీ, బిస్కెట్లు కావాలని చెప్పానని, ఇవి లేకుంటే రక్తంలో చెక్కర స్థాయి పడిపోతుందని, బీపీ తగ్గుతుందని, అందుకే అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చిందని వెల్లడించారు.

కాగా అనస్తీషియా ఇచ్చిన మహిళలు నితేష్ కాంటోడే, ప్రతిమ ప్రయోద్ బరాయ్, కరష్మా శ్రీతర్ రాజు, సునీతా యోగేష్ ఝంజోడే. డాక్టర్ చేసిన నిర్వాకంపై వీరి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

దీనిపై నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈఓ సౌమ్యశర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story