యమునా నది పొంగి పొర్లుతోంది.. సెల్ఫీలు దిగకండి : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

యమునా నది పొంగి పొర్లుతోంది.. సెల్ఫీలు దిగకండి : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
నిన్నటి నుండి బిజెపి నన్ను దుర్భాషలాడుతోంది. అవేవీ నేను పట్టించుకోదల్చుకోలేదు అని ఆయన అన్నారు.

దేశ రాజధానిలో యమునా నది పొంగి పొర్లుతోంది. దీంతో ప్రజా జీవనం అస్థవ్యస్థంగా మారింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలో ఎమర్జెన్సీ పరిస్థితులపై వేలెత్తి చూపడం, ఒకరినొకరు నిందించుకోవడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.వరదల కారణంగా మూతపడిన మూడు నీటి శుద్ధి కర్మాగారాలలో ఒకదానిని తిరిగి ప్రారంభించారు. మిగిలిన రెండింటిని కూడా త్వరలో తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. నదిలో నీటి మట్టం తగ్గుతుంది, భారీ వర్షాలు లేవు. కానీ శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నటి నుండి బిజెపి నన్ను దుర్భాషలాడుతోంది. అవేవీ నేను పట్టించుకోదల్చుకోలేదు అని ఆయన అన్నారు. చాలా రోజులుగా ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) కంటే ఎక్కువగా ఉన్న యమునా నదిలో నీటిమట్టం శనివారం ఉదయం నాటికి కొద్దిగా తగ్గింది.

ఈరోజు ఉదయం 10 గంటలకు యమునా నీటిమట్టం 207.48 మీటర్లుగా నమోదైంది. కొద్ది నిమిషాల తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ, యమునాలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోందని, మళ్లీ భారీ వర్షాలు పడకపోతే, త్వరలో పరిస్థితి సాధారణం అవుతుంది. చంద్రవాల్, వజీరాబాద్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల నుంచి నీటిని విడుదల చేయడం ప్రారంభించాం.. ఆ రెండు ప్లాంట్లు కూడా రేపటిలోగా పనిచేస్తాయని చెప్పారు.

వరద ముంపు ప్రాంతాలకు సమీపంలో ప్రజలు సెల్ఫీలు తీసుకోవద్దని, ముప్పు ఇంకా ముగిసిపోనందున జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. "కొంతమంది ప్రజలు ఆడుకోవడానికి లేదా ఈత కొట్టడానికి లేదా సెల్ఫీలు తీసుకోవడానికి లేదా నీరు నిండిన ప్రదేశాలలో వీడియోలు షూట్ చేయడానికి వెళ్తున్నారని అనేక ప్రాంతాల నుండి నివేదికలు వస్తున్నాయి. దయచేసి ఇలా చేయకండి. ఇది ప్రాణాంతకం కావచ్చు. వరద ముప్పు ఇంకా ముగియలేదు. నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది, నీటి మట్టం ఎప్పుడైనా పెరగవచ్చు ”అని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story