Maharastra: ఇక దైవ దర్శనానికి డ్రెస్‌ కోడ్‌

Maharastra: ఇక దైవ దర్శనానికి డ్రెస్‌ కోడ్‌
మహారాష్ట్రలో దైవ దర్శనానికి డ్రెస్‌ కోడ్‌.. ఇప్పటికే 131 ఆలయాల ఆమోదం.. పవిత్రత కాపాడేందుకే అన్న నిర్వాహకులు

మహారాష్ట్రలో ఆలయాలను దర్శించాలంటే ఇక సంప్రదాయ వస్త్రాలను ధరించాల్సిందే. చినిగిన జీన్స్‌ వేసుకుని.. స్లీవ్‌ లెస్‌ టాప్‌ వేసుకుని ఆలయాలకు వెళ్తామంటే ఇక కుదరదు. ఇప్పటికే వందకు పైగా ఆలయాలు ఈ డ్రెస్‌ కోడ్‌ను ఆమోదించాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. చిరిగిన జీన్స్, స్వీల్‌ లెస్‌ టాప్‌ ధరించిన వారిని ఆలయాలలోకి అనుమతించ వద్దని మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్‌ ప్రతిపాదించగా.. చాలా ఆలయాలు దీనిని ఆమోదిస్తున్నాయి. ఆలయ ధర్మకర్తలు.. నిర్వాహకులు, పూజారులు, న్యాయవాదులు... కార్యకర్తలు సభ్యులుగా ఉన్న మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ ఈ నిబంధన విధించింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలోని 131 దేవాలయాలు ఈ డ్రెస్‌ కోడ్‌ను ఆమోదించాయి. ఆలయాలను దర్శించాలంటే సంప్రదాయ దుస్తులు ధరించాలని...దుపట్టా వాడాలని నిబంధన విధించాలని భావిస్తోంది. దేవాలయాల్లో దర్శనం కోసం మహాసంఘ్ డ్రెస్‌ కోడ్‌ను రూపొందించింది. మహారాష్ట్రలోని 100 దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఈ కోడ్‌ను ఆమోదించాయి. భక్తులను అసభ్యకరమైన దుస్తులు ధరించకుండా ఈ నిబంధన విధించారు. దేవాలయాలు, పుణ్యక్షేత్రాల 500 మీటర్ల పరిధిలో మద్యం, మాంసం అమ్మకాలను నిషేధించాలని కూడా ప్రభుత్వాన్ని మహాసంఘ్ కోరింది . ఆలయాలను సందర్శించేటప్పుడు భక్తులు ఎలాంటి చిరిగిన వస్త్రాలు, ‘అసభ్యతగా ఉండే దుస్తులు ధరించరాదని మహాసంఘ్ పేర్కొంది. తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలే ధరించాలని సూచించింది. బిగుతుగా ఉండే బట్టలు.. చిరిగిపోయిన వస్త్రాలను ధరించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. కొందరు వ్యక్తులు సరిగా లేని దుస్తులు ధరించి ఆలయాలకు వచ్చి సోషల్ మీడియా కోసం రీళ్లు చేస్తున్నారని వారిని నియంత్రించి... ప్రార్థన స్థలం పవిత్రత కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మహా సంఘ్‌ పేర్కొంది. అసభ్యంగా లేని ప్యాంటు, షర్టులు వంటి ఆధునిక దుస్తులను ధరించి భక్తులు దైవ దర్శనం చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. ఈ ఏడాది చివరినాటికి గణనీయమైన సంఖ్యలో దేవాలయాలు డ్రెస్ కోడ్ పరిధిలోకి రావాలని మహా సంఘ్‌ కోరుతోంది. గోవా, ఉత్తరాఖండ్, దక్షిణాది రాష్ట్రాల్లోని దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలకు ఇలాంటి నియమాలు ఉన్నాయని మితవాద హిందూ జనజాగృతి సమితి వెల్లడించింది. అవే నిబంధనలను మహారాష్ట్రలో అమలు చేస్తామని పేర్కొంది. కొన్ని దేవాలయాల ఎదురుగా మాంసాన్ని విక్రయిస్తున్నారని.. ఇది ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story