6వ తరగతిలో ఫెయిల్.. అయినా మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో ఉత్తీర్ణత

6వ తరగతిలో ఫెయిల్.. అయినా మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో ఉత్తీర్ణత
ఫెయిల్యూర్ ఆ సమయానికి బాధ కలిగించినా చాలా మందికి చాలా పాఠాలు నేర్పిస్తుంది.

ఫెయిల్యూర్ ఆ సమయానికి బాధ కలిగించినా చాలా మందికి చాలా పాఠాలు నేర్పిస్తుంది. పట్టుదలతో సాధించాలనే కాంక్ష పెరుగుతుంది. ఈ రోజు ఫెయిలైందని ఎగతాళి చేసిన వారే రేపు ప్రశంసించే స్థాయికి ఎదగాలనే ఆలోచనలు కలుగుతాయి. దాంతో ఒక్కసారి ఓటమి రుచి చూసిన వారు విజయపథంలో పయనించిన గాధలు ఎన్నో ఎన్నెన్నో.

రుక్మణి రియార్ పాఠశాలలో ప్రత్యేకంగా ప్రతిభావంతులైన విద్యార్థి కాదు. ఆరవ తరగతిలో ఫెయిల్ అయింది. కానీ AIR 2తో UPSC పరీక్షను క్లియర్ చేయగలిగింది. UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష భారతదేశంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటి. IAS అధికారులు కావడానికి ప్రతి సంవత్సరం లక్షల మంది UPSC అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. అయితే, వారిలో కొద్ది శాతం మంది మాత్రమే యుపిఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఎఎస్ అధికారులుగా నియమితులవుతారు. UPSC పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే మంచి స్కోర్ సాధించిన IAS రుక్మణి రియార్ గురించి తెలుసుకుందాం.

రుక్మణి గురుదాస్‌పూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి, డల్హౌసీలోని గౌరవనీయమైన హిరీ స్కూల్‌లో 4వ తరగతిలో చేరింది. అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌లో సోషల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీని సాధించింది.

రుక్మణి TISS ముంబై నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత మైసూర్‌లోని అశోదా మరియు ముంబైలోని అన్నపూర్ణ మహిళా మండల్ వంటి ప్రభుత్వేతర సంస్థల (NGOలు)లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. తనకి ఎన్‌జిఓలో పనిచేస్తున్నప్పుడు సివిల్ సర్వీస్‌పై ఆసక్తి కలిగింది. అది యుపిఎస్‌సి పరీక్షకు ఎంపికయ్యేలా చేసింది.

2011లో తన మొదటి ప్రయత్నంలోనే UPSCని విజయవంతంగా క్లియర్ చేసింది. ఆమె ఆ పరీక్ష రాయడం కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. తానే సొంతంగా ప్రిపేర్ అవ్వాలని, ఎక్కడా కోచింగ్‌ తీసుకోకూడదని నిర్ణయించుకుంది. ఆమె NCER పుస్తకాలపై ఆధారపడింది. ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉన్న పుస్తకాలు సేకరించి వాటిని చదివేది. వాటితో పాటు క్రమం తప్పకుండా వార్తాపత్రికలను పరిశీలించేది.

ఇష్టంగా కష్టపడాలని, పట్టుదలగా ప్రయత్నించాలని రుక్మణి స్టోరీ మనకు తెలియజేస్తుంది. 6వ తరగతి ఫెయిల్ అయినప్పటి నుండి UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ పొందడం వరకు ఆమె కథనం అనేక మందిని ప్రేరేపిస్తుంది. తమ లక్ష్యాలను సాధించడంలో నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమేనని రుక్మణి కథ మనకు తెలియజేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story