ఢిల్లీలో యుద్ధ వాతావరణం.. ముట్టడికి లక్షలాదిగా రైతుల రాక

ఢిల్లీలో యుద్ధ వాతావరణం.. ముట్టడికి లక్షలాదిగా రైతుల రాక

ఉత్తరాది రైతులు ఢిల్లీని ముట్టడించేందుకు మరోసారి రెడీ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh), పంజాబ్ (Punjab), హర్యానాకు చెందిన లక్షలాది మంది రైతులు భారీ ర్యాలీలతో దేశ రాజధాని వైపుగా వస్తున్నారు. దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో వీరంతా గ్రూపులుగా విడిపోయి ర్యాలీలు చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్.

సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200 రైతుల సంఘాలు ఢిల్లీ ఛలో మార్చ్ కు ఇప్పటికే పిలుపునిచ్చాయి. మరోసారి దేశ రాజధాని రైతుల ఆందోళనలతో వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు సంఘాల ఢిల్లీ ఛలో మార్చ్ నేపథ్యంలో పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని భారీగా మోహరించారు. భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి రైతుల ధర్నాలో ఉద్రిక్తత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా రైతులు రాజధానిలోకి ప్రవేశించారు. రిపబ్లిక్ డే సందర్భంగా అనూహ్యంగా ఎర్రకోట వరకూ వెళ్లిపోయారు. ఈసారి సెక్షన్ 144 అమలు చేసి వీరిని ఎక్కికక్కడే ప్రశాంత నిరసన జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగూ, టిక్రి, ఘాజీపూర్‌లోని దేశ రాజధాని సరిహద్దులను కోటలుగా మార్చి గట్టి బందోబస్తు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story