మీకు అన్నీ ఫ్రీగా కావాలి : రైతుల ధర్నాపై వృద్ధురాలు ఆగ్రహం

మీకు అన్నీ ఫ్రీగా కావాలి : రైతుల ధర్నాపై వృద్ధురాలు ఆగ్రహం

ఢిల్లీకి (Delhi) కవాతు చేయడానికి సిద్ధంగా రైతులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఢిల్లీ, పంజాబ్‌ల (Punjab) మధ్య ఙారీ భద్రత, ప్రధాన ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారుయ. ఈ సమయంలో, పంజాబ్‌లోని ఒక వృద్ధ మహిళ ప్రజల దైనందిన జీవితానికి అంతరాయం కలిగించినందుకు రైతులను దూషిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో, మార్గమధ్యంలో ధర్నాకు కూర్చున్న రైతులపై ఆమె అరుస్తూ కనిపించింది. "మీ డిమాండ్ ఎప్పటికీ తీరదు. మీకు అన్నీ ఉచితంగా కావాలి. కేంద్రం మీకు చాలా ఉచితంగా ఇస్తోంది, అయినా మీరు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, రోడ్లను దిగ్బంధిస్తున్నారు" అని ఆమె అరిచింది.

మద్దతు ధర కోసం చట్టపరమైన హోదా, MSP కింద మొత్తం 22 పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ హామీని కోరుతూ ఫిబ్రవరి 13న రైతులు ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైసరీని జారీ చేశారు. వారు రుణమాఫీ & తక్కువ విద్యుత్ ఛార్జీలను కూడా డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఫిబ్రవరి 13న 'ఢిల్లీ చలో' మార్చ్‌కు ముందు వచ్చే 30 రోజుల పాటు ఢిల్లీ నగరం మొత్తం 144 సెక్షన్ విధించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే అరెస్టు చేస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story