లేఆఫ్ ల మధ్య నియామకాలు.. 200 ఉద్యోగాలు

లేఆఫ్ ల మధ్య నియామకాలు.. 200 ఉద్యోగాలు
ప్రముఖ ఐటీ సంస్థలు కూడా చెప్పాపెట్టకుండా ఉద్యోగాలు పీకేస్తున్నాయి.

ప్రముఖ ఐటీ సంస్థలు కూడా చెప్పాపెట్టకుండా ఉద్యోగాలు పీకేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఫైనాన్స్ కంపెనీ భారతదేశంలో 200 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. IITలు, BITS పిలానీ, NIT ఢిల్లీ సహా అగ్రశ్రేణి విద్యాసంస్థల నుండి ప్రతిభ గల అభ్యర్థులను కంపెనీ లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది.

డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ Biz2Credit సోమవారం తన సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) ఆధారిత ప్లాట్‌ఫారమ్ Biz2X కోసం భారతదేశంలో 200 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. దేశీయ మార్కెట్‌లో తన ఉనికిని విస్తరించే ప్రయత్నంలో అగ్రశ్రేణి విద్యాసంస్థల నుండి అభ్యర్ధులను ఎంపిక చేసుకోవాలనుకుంటోంది. Biz2X వారి చిన్న. మధ్యతరహా వ్యాపార కస్టమర్లకు ఆన్‌లైన్ రుణ అనుభవాన్ని అందించడానికి ఆర్థిక సంస్థలను అనుమతిస్తుంది.

మేము మా ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉన్నాము, తద్వారా డిజిటల్ లెండింగ్ లో ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తాము" అని Biz2X HR హెడ్ విజయ్ కుమార్ జమ్వాల్ అన్నారు. కంపెనీ డేటా సైన్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ టీమ్‌ల వంటి డొమైన్‌లలో రిక్రూట్ మెంట్ జరుగుతుంది అని తెలిపారు. Biz2Credit గత సంవత్సరంతో పోలిస్తే 2022లో 44 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది 70 శాతానికి పైగా వృద్ధి రేటును అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులతో, పూణే, నోయిడా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాంతాలలో Biz2X ను విస్తరింపజేయాలని కంపెనీ యోచిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story