G-20: విదేశీ అతిథుల నోరూరించే వంటకాలు

G-20:  విదేశీ అతిథుల  నోరూరించే వంటకాలు
250 రకాల దేశీయ, విదేశీ వంటకాలతో మెనూ, తృణ ధాన్యాలకు ప్రాధాన్యం

ఈసారి జీ 20 దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.. ఈ సమావేశాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత్.. దీనికి సంబంధించి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. భద్రత మాత్రమే కాదు జీ 20 దేశాధినేతలు రానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలను చూస్తోంది. దేశాధినేతలు కోసం నోరూరించే వంటకాలు సిద్ధం చేయనున్నారు. హోటళ్ళను అద్భుతంగా అలంకరిస్తున్నారు.

ప్రపంచ దేశాధినేతలకు, వారితో పాటు వచ్చే అధికారులు, ప్రతినిధుల బృందాలకు పేరుమోసిన హోటళ్లలో బస ఏర్పాటు చేస్తున్నారు. దీనితో పాటు ఆయా హోటళ్లలో రుచికరమైన, భారతీయ విశిష్టతను చాటే వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా, తృణ ధాన్యాలతో తయారైన వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డించనున్నారు.

నిజానికి భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిగా పాతకాలపు ఆహారపు అలవాట్లు తిరిగి అనుసరిస్తున్నారు. దీనిని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. మిల్లెట్‌లు భారతదేశంలో, ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో అనేక శతాబ్దాలుగా ప్రధాన ఆహారంగా ఉన్నాయి. 5,000 సంవత్సరాల క్రితం చైనా నుండి ఈ తృణధాన్యాలు వచ్చినట్లు చరిత్రచెబుతుంది. జొన్న,జొన్నలు, సజ్జలు, కోర్రలు, వరిగెలు, రాగులు, గోధుమలు, ఓట్స్, కులై, అరికెలు, అండు కొర్రలు, సమాలు, ఊద‌లు, కార్న్,ఉలవలు మొదలగునవి.


ఇప్పుడు వీటితో చేసే వంటలు భారతదేశంలో ప్రధానంగా సాగుతున్నాయి. అంతే కాదు. మోడీ విదేశి పర్యటనలో కూడా తృణ ధాన్యాలతో కూడిన భోజనానికి మాత్రంమే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక జీ-20 సదస్సు అతిథులకు అందించే మెనూలో దేశంలోని పలు రాష్ట్రాల ఫేమస్ వంటకాలు, వాటితో పాటు విదేశీ వంటకాలను సైతం సిద్ధం చేయనున్నారు. మొత్తం 250 రకాల స్వదేశీ, విదేశీ వంటకాలకు మెనూలో చోటు కల్పించారు. అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. ఎందుకంటే మన సనాతన ధర్మంలోనే ఉంది అతిథి దేవో భావ అని.

సెప్టెంబర్ 09, 10 తేదీల్లో G20 సమావేశం ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరుగనుంది. ఈ సదస్సు సందర్భంగా ప్రతినిథులు ముందుగా రాజ్‌ఘాట్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్(NGMA), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(IARI) లను G20 ప్రతినిథులు సందర్శిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story