BJP వైపు మళ్లిన గాలి

BJP వైపు మళ్లిన గాలి

తన బ్లడ్ లోనే బీజేపీ (BJP) ఉందన్నారు కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి (Janardhan Reddy). తన సొంత పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్షని బీజేపీలో విలీనం చేసి మరింతగా రాజకీయాల్లో వెలిగిపోవాలని నిర్ణయించారు. కర్ణాటకలోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కండువా కార్యక్రమంతో ఆయన వర్గంలో జోష్ కనిపిస్తోంది.

''బీజేపీ మా రక్తంలోనే ఉంది. ఇప్పుడు సొంత పార్టీలోకి తిరిగి వస్తున్నా. బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇద్దామని తొలుత అనుకున్నాం. కానీ నా పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేస్తేనే బెటర్ అని మా కార్యకర్తలు చెప్పారు. అందుకే బీజేపీలో పార్టీని విలీనం చేస్తున్నా. మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు నావంతుగా సాయం చేస్తున్నా. బీజేపీలో చేరి సాధరణ కార్యకర్తగా పని చేస్తా'' అని ఆదివారం తెలిపారు గాలి జనార్ధన్ రెడ్డి.

రీసెంట్ గా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి తన ఓటును కాంగ్రెస్​కు వేశారు. అయితే అది తన మనస్సాక్షి ఓటు అని తాజాగా సమర్థించుకున్నారు. మాజీ మంత్రి శ్రీరాములుతో తనకు విభేదాలేం లేవని చెప్పారు. ఆయన్ను చిన్నప్పటి నుంచి తాను పెంచినట్లు తెలిపారు. బళ్లారి లోక్‌​సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు మద్దతిస్తానని చెప్పారు. 2022లో గాలి జనార్దన్​రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష ని స్థాపించారు. ఈపార్టీని బీజేపీలో విలీనం చేయడానికి పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈసారి కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా ఢీకొట్టేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని బీజేపీ వాడుకుంటోంది. ఈక్రమంలోనే అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని తిరిగి బీజేపీలోకి ఆహ్వానించింది.

Tags

Read MoreRead Less
Next Story