3 నెలల్లో ఫిట్ నెస్ లేదంటే రిటైర్మెంటే.. పోలీసులకు హెచ్చరిక

3 నెలల్లో ఫిట్ నెస్ లేదంటే రిటైర్మెంటే.. పోలీసులకు హెచ్చరిక
పోలీసు ఉద్యోగం రావడం అంటే మాటలు కాదు.. సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష పాసవడం ఒక ఎత్తైతే దేహదారుడ్య పరీక్షల్లో నెగ్గాలి.

పోలీసు ఉద్యోగం రావడం అంటే మాటలు కాదు.. సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష పాసవడం ఒక ఎత్తైతే దేహదారుడ్య పరీక్షల్లో నెగ్గాలి. అదే పోలీసు ఉద్యోగానికి చాలా అత్యవసరమైన ఘట్టం. శరీరసౌష్టవానికి సంబంధించిన టెస్టుల్లో పాసైతే జాబ్ గ్యారెంటీ.

పోలీసు సిబ్బంది ఫిట్‌నెస్‌పై పనిచేయడానికి మూడు నెలల సమయం ఇచ్చారు. అస్సాం పోలీసు శాఖ ఫిట్ నెస్ డ్రైవ్‌ను ప్రారంభించింది. "ఐపిఎస్ & ఎపిఎస్ అధికారులతో సహా అస్సాం పోలీసు సిబ్బందికి ఆగస్టు 15 వరకు మూడు నెలల సమయం ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాము అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ GP సింగ్ ఈ రోజు ట్వీట్ చేశారు.

మూడు నెలల్లో పెరిగిన పొట్టను తగ్గించుకోకపోతే ఇక ఇంటికే అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) అందించబడుతుంది. అయితే, హైపోథైరాయిడిజం వంటి వైద్యపరమైన కారణాలు ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని సింగ్ తెలియజేశారు.

గత నెలలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ పోలీసు శాఖలో స్థూలకాయులు, అవినీతి కేసులు ఉన్నవారికి VRS ఇవ్వబడుతుంది. “సుమారు 300 మంది పోలీసు అధికారులు అధికంగా మద్యం సేవించడం వల్ల వారి శరీరాలు దెబ్బతిన్నాయి అని శర్మ ఏప్రిల్ 30 న ఒక కార్యక్రమంలో చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story