రాహుల్ కోసం ఓ అమ్మాయిని వెతికిపెట్టండి: హర్యానా మహిళలతో సోనియా

రాహుల్ కోసం ఓ అమ్మాయిని వెతికిపెట్టండి: హర్యానా మహిళలతో సోనియా
పెళ్లవ్వకపోతే పెళ్లెప్పుడు అని, పెళ్లైతే ఇంకా పిల్లల గురించి ఆలోచించరా అని ఇవి అందరూ ఎదుర్కొనే సాధారణ ప్రశ్నలు.

పెళ్లవ్వకపోతే పెళ్లెప్పుడు అని, పెళ్లైతే ఇంకా పిల్లల గురించి ఆలోచించరా అని ఇవి అందరూ ఎదుర్కొనే సాధారణ ప్రశ్నలు.అందుకు రాహుల్ గాంధీ ఏమీ అతీతుడు కాదు.. నలభై ఏళ్లు వచ్చినా నాలుగు అక్షింతలు పడలేదని తల్లికి లోలోన బాధ ఉన్నా ఎప్పుడూ బయట పడలేదు.. చాలా హూందాగా వ్యవహరిస్తుంటారు సోనియా.. హర్యానా మహిళలకు, మాజీ కాంగ్రెస్ చీఫ్ కు మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది.

జూలై 8న సోనిపట్‌లోని మదీనా గ్రామాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు. ప్రజలతో మమేకమై వ్యవసాయ భూముల్లో పని చేస్తున్న రైతులతో గడిపారు. వరి నాట్లు వేయడంలో కూడా పాల్గొన్నారు. ట్రాక్టర్‌ నడుపుతూ పొలాల్లో పనిచేసే మహిళా కూలీలు తీసుకొచ్చిన ఆహారాన్ని తింటూ వారితో ముచ్చటించారు.

తాము దేశ రాజధానిని ఎన్నడూ సందర్శించలేదని మాటల మధ్యలో తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ వారిని 'ఢిల్లీ దర్శనం' కోసం తమ ఇంటికి ఆహ్వానిస్తామని వారికి హామీ ఇచ్చారు. తన పర్యటనలో సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉంది. సోనిపట్‌లోని రైతు సోదరీమణులను ఢిల్లీకి తీసుకెళ్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రైతు సోదరీమణులు ఢిల్లీకి వచ్చారు, ఇచ్చిన హామీ నెరవేరింది' అని కాంగ్రెస్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది.

“కొంతమంది ప్రత్యేక అతిథులతో ఈ రోజు మా భోజనం ముగిసింది. ప్రియాంకకు, నాకు ఇది గుర్తుంచుకోవలసిన రోజు. సోనిపట్ రైతు సోదరీమణుల ఢిల్లీ దర్శనం, ఇంట్లో వారితో భోజనంతో పాటు చాలా చర్చలు జరిగాయి. దేశీ నెయ్యి, స్వీట్ లస్సీ, ఇంట్లో తయారుచేసిన పచ్చళ్లు.. వావ్ సూపర్ భోజనం.. అన్నిటికీ మించి వాళ్లు మాపై చూపించిన ప్రేమ” అని రాహుల్ గాంధీ ట్వీట్‌లో సమావేశం వీడియోను పంచుకున్నారు.

హర్యానా మహిళలతో ముచ్చటించిన సోనియాకు వారి నుంచి రాహుల్ పెళ్లి ప్రశ్న ఎదురైంది. కొడుక్కి పెళ్లి ఎప్పుడు చేస్తావు అని ప్రశ్నించగా,, అమ్మాయిని చూడండి అని సోనియా కూడా అంతే సరదాగా వారితో అన్నారు. అక్కడే ఉన్న రాహుల్ అందుకుని “ఇది జరుగుతుంది” అని చెప్పారు. ప్రియాంక గాంధీ వాద్రా మహిళలతో మాట్లాడుతూ "రాహుల్ తన కంటే చాలా కొంటెవాడు'' అని హర్యానా మహిళలతో సరదా సంభాషణ జరిపింది.

https://t.co/2rATB9CQoz

Tags

Read MoreRead Less
Next Story