పుట్టినరోజు నాడు యువకుడి వికృత చేష్టలు.. కరెన్సీని గాలిలోకి విసిరి..

పుట్టినరోజు నాడు యువకుడి వికృత చేష్టలు.. కరెన్సీని గాలిలోకి విసిరి..
డబ్బులు ఎక్కువ వుంటే ఓ మంచి పనికి వినియోగించు.. అంతే కానీ గాలిలోకి విసిరి లక్ష్మీదేవిని అవమానిస్తే ఏదో ఒక రోజు అడుక్కుతినే పరిస్థితి వస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ యువకుడిని తిట్టిపోస్తున్నారు.

డబ్బులు ఎక్కువ వుంటే ఓ మంచి పనికి వినియోగించు.. అంతే కానీ గాలిలోకి విసిరి లక్ష్మీదేవిని అవమానిస్తే ఏదో ఒక రోజు అడుక్కుతినే పరిస్థితి వస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ యువకుడిని తిట్టిపోస్తున్నారు. పటాకులు పేల్చి, పుట్టినరోజు చేసుకోవలనుకుంటే ఓకే.. అంతేకానీ డబ్బుని ఎగరేస్తావా అని మండిపడుతున్నారు.

ఈ ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకల సందర్భంగా గాలిలోకి కరెన్సీ విసిరిన వీడియో వైరల్ కావడంతో ఘజియాబాద్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లోపల కారు పైకప్పుపై నిలబడి ముగ్గురు వ్యక్తులు బాణసంచా కాల్చిన వీడియోను అపార్ట్‌మెంట్ యజమానుల సంఘం ఎక్స్ లో పోస్ట్ చేసింది. పోలీసులు వీడియోను పరిశీలించి చర్యలు తీసుకున్నారు.

ఆదివారం రాత్రి ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరగగా, నంద్‌గ్రామ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రవి కుమార్ సింగ్ మాట్లాడుతూ, యువకులు అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారని, ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారని తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ముగ్గురు వ్యక్తులు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నివాసితులతో కారు పైకప్పుపై నిలబడి బాణాసంచా కాల్చారు. ముగ్గురూ ఫోటోలకు పోజులిస్తుండగా వారిలో ఒకరు కరెన్సీ నోట్లను గాలిలోకి విసిరారు. ఈ ఏడాది ప్రారంభంలో విలాసవంతమైన కార్లలో కొందరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story