GUJARATH HC: రాహుల్‌కు స్టే ఇచ్చేందుకు నిరాకరణ

GUJARATH HC: రాహుల్‌కు స్టే ఇచ్చేందుకు నిరాకరణ
మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది.

గుజరాత్‌ కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. కింది కోర్టు తీర్పును సమర్ధించింది. రాహుల్‌పై 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న గుజరాత్ హైకోర్టు ఈ కేసు తర్వాత కూడా మరిన్ని కేసులు నమోదయ్యాయని వ్యాఖ్యానించింది. వీర్‌సావర్కర్ మనవడు కూడా రాహుల్‌పై పరువునష్టం దావా వేశారని దోషిగా తేలినంత మాత్రాన అన్యాయం జరిగినట్టు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.కింది కోర్టు ఉత్తర్వులపై జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో గుజరాత్‌ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాహుల్‌గాంధీ నిర్ణయించారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే అంటూ వ్యాఖ్యానించిన కేసులో తనకు శిక్ష నిలుపుదల చేయాలని రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించగా,ఈ తీర్పును రాహుల్‌ హైకోర్టులో సవాలు చేశారు. మే 2న విచారణ పూర్తి చేసిన గుజరాత్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story