Tejas-MK 1A: గగన విహారం చేసిన తేజస్-ఎంకే 1ఏ యుద్ధ విమానం

Tejas-MK 1A: గగన విహారం చేసిన తేజస్-ఎంకే 1ఏ యుద్ధ విమానం
బెంగళూరులో తేజస్ గగన విహారం

భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్. దీన్ని మరింత ఆధునికీకరించి తేజస్-ఎంకే 1ఏ వెర్షన్ కు రూపకల్పన చేశారు. ఇప్పుడీ సరికొత్త పోరాట విమానం తొలిసారిగా పూర్తిస్థాయిలో విజయవంతంగా గగన విహారం చేసింది. ఇప్పటికే ఈ తేలికపాటి యుద్ధ విమానం భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. ఇప్పుడు బెంగళూరులో అన్ని హంగులతో, సకల అస్త్రశస్త్రాలను అమర్చుకుని సంతృప్తికరంగా గగన విహారం చేసింది.

భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్ డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ఈ ఫైటర్ జెట్ ను డిజైన్ చేసింది. తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది.

గత కొన్నేళ్లుగా అనేక పర్యాయాలు తేజస్ యుద్ధ విమానాలకు ట్రయల్స్ నిర్వహించారు. తాజా గగన విహారం 18 నిమిషాల పాటు సాగింది. రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపారు. త్వరలోనే ఈ విమానాలను వాణిజ్య ప్రాతిపదికన సరఫరా చేసే అవకాశాలున్నాయి.

పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ రెండు వారాల క్రితం ’ రాజస్థాన్‌లో కుప్పకూలింది. 23 ఏళ్ల తేజస్ చరిత్రలో తొలిసారిగా విమానం క్రాష్ అయింది. జైసల్మేర్‌లోని హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కుప్పకూలింది. పైలెట్ ఎజెక్షన్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. 2001లో టెస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రారంభమైన ఈ స్వదేశీ యుద్ధవిమానం కూలిపోవడం అదే తొలిసారి. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌గా పేరు తెచ్చుకుంది. తేజస్ విమానం చిన్నది, తేలికపాటి విమానం. 2016లో తొలిసారిగా తేజస్‌ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్‌లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఐఏఎఫ్ 40 తేజస్ ఎంకే-1 విమానాలను నిర్వహిస్తోంది. రూ. 36,484 కోట్ల విలువైన మరో 83 తేజస్-ఎంకే 1 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది.

పైలెట్ల ప్రాణాలను హరిస్తున్న మిగ్-21 విమానాలను 2025 నాటికి తేజస్ మార్క్ 1ఏ విమానంతో భర్తీ చేయాలని భారత వైమానిక దళం భావిస్తోంది. 1963 నుండి వైమానిక దళానికి సేవలందిస్తున్న MiG-21ల స్థానంలో లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ఏసీ) కార్యక్రమాన్ని 1980 చివర్లో రూపొందిచారు. 2003లో ఎల్ఏసీకి ‘తేజస్’గా పేరు పెట్టారు

Tags

Read MoreRead Less
Next Story