భారత్ లో మరోసారి భారీగా కరోనా కేసులు.. గత 24 గంటల్లో

భారత్ లో మరోసారి భారీగా కరోనా కేసులు.. గత 24 గంటల్లో
దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 96 వేల 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52 లక్షల 14 వేలు దాటింది. నిన్న ఒక్క రోజులో..

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 96 వేల 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52 లక్షల 14 వేలు దాటింది. నిన్న ఒక్క రోజులో వైరస్‌ వల్ల 11 వందల 74 మంది చనిపోయారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 84 వేల 372కి చేరింది. దేశంలో ప్రస్తుతం 10 లక్షల 17 వేల 754 యాక్టివ్ కేసులు ఉండగా... 41 లక్షల 12 వేల మంది డిశ్చార్జ్‌ అయినట్టు... కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 78.86 శాతంగా ఉంది. అటు కరోనా మరణాల రేటు 1.62శాతంగా ఉంది.

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కొత్త మరో 24 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 11 లక్షల 45 వేలు దాటింది. 3 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా... 8 లక్షల 11 వేల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్క రోజులో 468 మంది చనిపోగా.. మొత్తం మరణాలు 31 వేల 350 దాటాయి. కేసుల పరంగా రెండో స్థానంలో ఉన్న ఏపీలో కొత్త 8 వేల 7వందల కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6 లక్షలు దాటింది. వీరిలో 88 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 5 లక్షల మంది రికవర్ అయ్యారు. ఏపీలో మరణాల సంఖ్య 5 వేల 177కి చేరింది.

మూడోస్థానంలో ఉన్న తమిళనాడులో మొత్తం కేసులు 5 లక్షల 25 వేలు దాటాయి. 46 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 4 లక్షల 70 వేల మంది రికవర్ అయ్యారు. దేశవ్యాప్త కరోనా జాబితాలో నాలుగో ఉన్న కర్నాటకలో మళ్లీ కేసులు పెరుగుతన్నాయి. నిన్న ఒక్క రోజులో దాదాపు 10 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 5 లక్షలకు చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు 6 కోట్ల 15 లక్షల 72 వేల కరోనా టెస్టులు నిర్వహించినట్టు... ICMR తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story