భారత్‌లో కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో..

భారత్‌లో కరోనా విజృంభణ..  గత 24 గంటల్లో..
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో... 9 లక్షల 53 వేల 683 పరీక్షలు నిర్వహించగా..

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో... 9 లక్షల 53 వేల 683 పరీక్షలు నిర్వహించగా... 83 వేల 347 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56 లక్షల 46 వేల 11కి చేరినట్టు.. కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 9 లక్షల 68 వేల 377 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజులో కరోనా నుంచి 89 వేల 746 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల 87 వేల 613 మంది రికవర్‌ అయ్యారు. నిన్న ఒక్క రోజులో కరోనాతో ఒక వెయ్యి 85 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 90 వేలు దాటింది.

దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 81.25 శాతానికి చేరుకోగా... మరణాల రేటు 1.59 శాతానికి తగ్గింది. భారత్‌లో ఇప్పటి వరకు 6 కోట్ల 62 లక్షల 79 వేల కరోనా టెస్టులు నిర్వహించినట్టు ICMR తెలిపింది. మహారాష్ట్రలో కొత్తగా మరో 18 వేల కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 12 లక్షల 42 వేలు దాటింది. ప్రస్తుతం అక్కడ 2 లక్షల 72 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 9 లక్షల 36 వేల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 33 వేల 407 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఏపీలో, తమిళనాడు, కర్నాటక, యూపీల్లో.. కరోనా తీవ్రత కొనసాగుతోంది. నెల రోజుల క్రితం తగ్గుముఖం పట్టిన కేసులు ఢిల్లీలో మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story