Road accident: రోడ్డు ప్రమాద మరణాల్లో మనమే టాప్‌

Road accident: రోడ్డు ప్రమాద మరణాల్లో మనమే టాప్‌
ప్రమాదాల కారణంగా ఏటా15 లక్షల మంది మృత్యువాత -ఫిక్కీ నివేదిక

ప్రతి ఏటా భారత్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా 15 లక్షల మంది చనిపోతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఫిక్కీ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించే వారిలో 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులే అత్యధికంగా ఉంటున్నారని డబ్ల్యూహెచ్‌వో నివేదిక తెలిపింది. మానవుల మరణాల్లో రోడ్డు ప్రమాదాలు 8వ స్థానాన్ని ఆక్రమించాయని ఆ నివేదిక పేర్కొంది. అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గతంలో ఓ నివేదిక వెల్లడించింది.


రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా భారత్‌లో 15 లక్షల మంది చనిపోతున్నట్లు ఫిక్కీ-ఈవై నివేదిక తాజాగా వెల్లడించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 11 శాతానికి సమానమని వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి 24 సెకన్లకు ఒకరు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. రోడ్డు ప్రమాదాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంభవించడానికి రోడ్డు ప్రమాదాలు 8వ కారణమని ఆ సంస్థ తెలిపింది. ఆ ప్రమాదాల్లో యువకులే ఎక్కువగా కన్నుమూస్తున్నట్లు గుర్తించింది. 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడించింది. అందుకే 2030 కల్లా రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో భారత్‌ ఇదివరకే బ్రసీలియా డిక్లరేషన్‌పై సంతకం చేసింది.

ఫిక్కీ-ఈవై నివేదికను ఒడిశా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి టుకుని సాహూ దిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వాలతో కార్పొరేట్‌ సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆమె ఆకాక్షించారు. కేవలం జాతీయ రహదారులపై మాత్రమే కాకుండా పట్టణాల్లో డ్రైవింగ్ చేసే సమయంలో వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోవడం, హెల్మెట్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత సమష్టి బాధ్యతని.. అందులో చట్టసభ్యులు, కార్పొరేట్లు, పౌరులు పాలు పంచుకోవాలని ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ పేర్కొన్నారు

Tags

Read MoreRead Less
Next Story