రాజ్య‌స‌భలో క్ష‌మాప‌ణ‌లు చెప్పిన జ‌యా బ‌చ్చ‌న్‌

రాజ్య‌స‌భలో క్ష‌మాప‌ణ‌లు చెప్పిన జ‌యా బ‌చ్చ‌న్‌

ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ (Jayabachchan) రాజ్య‌స‌భ‌లో అందరి ముందూ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌న చివ‌రి ప్ర‌సంగం సంద‌ర్భంగా ఆమె చేతులు జోడించి సారీ చెప్పారు. జ‌యాబ‌చ్చ‌న్ సాధార‌ణంగా ఎప్పుడూ కోపంగా ఉంటుందని, ఆమె మాట తీరు కూడా క‌ఠినంగా ఉంటుందనే టాక్ ఇప్పటికే ఉంది. ఇటీవ‌ల రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌పై కూడా ఆమె ఆవేశంలో కామెంట్ చేయడంతో అది కాస్తా తేటతెల్లం అయింది. అయితే తాజాగా ఫేర్‌వెల్ స్పీచ్ సంద‌ర్భంగా జ‌యాబ‌చ్చ‌న్ మాట్లాడుతూ.. తానో షార్ట్ టెంప‌ర్ వ్య‌క్తిన‌న్నారు. ఎవ‌ర్నీ బాధ పెట్ట‌డం త‌న ఉద్దేశం కాద‌న్నారు.

ఎందుకు ఎప్పుడూ ఆవేశానికి లోన‌వుతుంటావ‌ని అంద‌రూ త‌న‌ను ప్ర‌శ్నిస్తార‌ని, కానీ అది త‌న స్వ‌భావం అని, దాన్ని మార్చుకోలేన‌ని జయాబచ్చన్ చెప్పారు. ఏదైనా విష‌యాన్ని అంగీక‌రించ‌లేని స‌మ‌యంలో తాను త‌న స‌హ‌నాన్ని కోల్పోనున్న‌ట్లు ఆమె చెప్పారు. మీతో నేనెప్పుడైనా అసంబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే వారికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు జ‌యాబ‌చ్చ‌న్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story