Karnataka: గేటెడ్ కమ్యూనిటీలో రోడ్లపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది

Karnataka:  గేటెడ్ కమ్యూనిటీలో రోడ్లపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది
కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

లేట్‌అవుట్ హక్కులను స్థానిక సంస్థలకు బదిలీ చేశాక లేఅవుట్ వీధులపై లాండ్ ఓనర్లకు, డెవలపర్లకు ఎలాంటి హక్కులూ ఉండవని కర్ణాటక హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. గేటెడ్ కమ్యూనిటీ వీధుల వినియోగంపై దాఖలైన పిటిషన్‌లో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.

ఒక ప్లాట్ డెవలపర్లు, యజమానులు భూమిపై నియంత్రణను వదులుకున్న తర్వాత, అక్కడ నిర్మించిన రోడ్లపై వారికి ఎటువంటి హక్కులు ఉండవని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. సింగిల్ జడ్జి బెంచ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జి బెంచ్, నవంబర్ 29, 2022 నాటి తన తీర్పులో గేటెడ్ కమ్యూనిటీ అనే భావన లేదని పేర్కొంది. బెలందూర్‌లోకి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా టవర్స్‌కు చెందిన పబ్బరెడ్డి కోదండరామిరెడ్డికి వ్యతిరేకంగా ఉప్కార్ రెసిడెన్సెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. లేవుట్‌కు సంబంధించి రైట్స్ ఆఫ్ ఇంగ్రెస్, ఇగ్రెస్ తమకు ఇప్పించాలని పిటిషనర్లు కోరారు. అయితే, గేటెడ్ కమ్యూనిటీలోని రోడ్లపై పూర్తి హక్కులు తమవేనని కోదండరామి రెడ్డి వాదించారు. ఆ వీధులు గేటెడ్ కమ్యూనిటీ వాసుల వినియోగానికి మాత్రమేనని పేర్కొన్నారు.

అయితే, ఈ కేసుపై గతంలో సింగిల్ జడ్జి్ ధర్మాసనం కోదండరామిరెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. గేటెడ్ కమ్యూనిటీ అనే భావనే చట్టంలో లేదన్న న్యాయస్థానం, కమ్యూనిటీ వీధులను ప్రజలు వాడుకోకుండా అభ్యంతరం చెప్పే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేసింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ కోదండరామిరెడ్డి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం తాజాగా ఆయన అప్పీలును కొట్టేసింది. చట్టానికి అనుగుణంగా ఉన్న ఏకసభ్య ధర్మాసనం తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. భూమిని అభివృద్ధి చేసే వ్యక్తి సాధారణ ప్రజలను రహదారిని ఉపయోగించకుండా ఆపలేరు. అప్పీల్‌ను తోసిపుచ్చిన డివిజన్ బెంచ్, లేఅవుట్ ఆమోదించబడినప్పుడు, లేఅవుట్‌లో ఉన్న రోడ్లను మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని, ఈ రోడ్లు సాధారణ పౌరులందరికీ ఉపయోగించాలనే షరతు ఉందని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో రాయితీలు ఇచ్చినప్పటికీ, రోడ్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత, సాధారణ ప్రజలు రోడ్లను ఉపయోగించకుండా నిరోధించే హక్కు డెవలపర్ లేదా భూ యజమానికి ఉండదు. లేఅవుట్ శాంక్షన్ అయిన సందర్భంలోనే ప్రజావసరాలకు గేటెడ్ కమ్యూనిటీ రోడ్ల వినియోగంపై నిబంధనలను సంబంధిత ప్రభుత్వ విభాగాలు స్పష్టంగా పేర్కొన్నాయని వ్యాఖ్యానించింది. ఈ నిబంధనల ప్రకారం, రోడ్ల నిర్వహణ స్థానిక సంస్థలది, వీటి వినియోగంపై ప్రజలకు పూర్తి హక్కు ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story