Kejriwal : 19న విచారణకు రండి.. కేజ్రీవాల్‌ కు ఆరోసారి ఈడీ సమన్లు

Kejriwal : 19న విచారణకు రండి.. కేజ్రీవాల్‌ కు ఆరోసారి ఈడీ సమన్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) త్వరలోనే అరెస్ట్ కానున్నారా.. ఏమో చెప్పలేం. దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి సమన్లు జారీచేసింది. బుధవారం సాయంత్రం జారీ చేసిన ఈ సమన్లలో ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని సూచించింది. కేజ్రీవాల్‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ కావడం ఇది ఆరోసారి.

లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపుతోంది. ఐదుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ స్పందించలేదు. ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఇడి అధికారులు కోర్టును ఆశ్రయించగా విచారణకు కేజ్రీవాల్‌ సహకరించాలని తెలిపింది.

లిక్కల్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా కొన్ని నెలల నుంచి తీహార్‌ జైల్లో ఉంటున్నారు. 2023 నవంబర్‌ 2, డిసెంబర్‌ 21, 2024 జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈడీ నోటీసులను ఆప్ తప్పుపడుతోంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుతోందని ఫైరవుతున్నారు చీపురు పార్టీ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story