అంబానీల నుండి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు

అంబానీల నుండి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఆయన సహధర్మచారిణి నీతా అంబానీ, భారతీయ సంపన్న కుటుంబం చాలా మందికి స్ఫూర్తి.

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఆయన సహధర్మచారిణి నీతా అంబానీ, భారతీయ సంపన్న కుటుంబం చాలా మందికి స్ఫూర్తి. వారి దూరదృష్టితో కూడిన నాయకత్వం, వ్యవస్థాపక కార్యక్రమాలు, దాతృత్వ పనులు శాశ్వతమైన వారసత్వాన్ని మిగిల్చేందుకు కొనసాగుతాయి.

వారి ముగ్గురు సంతానం ఆకాష్, ఇషా, అనంత్ ముఖేష్, నీతాల పెంపంకంలో నిరాడంబరంగా పెరిగారు. సంపన్న కుటుంబ నేపథ్యం, బిలియన్ల విలువ ఉన్నప్పటికీ, నీతా, ముఖేష్ అంబానీ ఇద్దరూ తమ పిల్లలకు కష్టపడి పని చేయడం, సాధారణ జీవనం యొక్క ప్రాముఖ్యతను నేర్పించారు.

నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలిగా, చైర్‌పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. విద్య, సంస్కృతి, సామాజిక సేవ, మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషి ఎందరికో స్ఫూర్తి.

ధీరూభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీలు రిలయన్స్ రిఫైనరీస్‌ని స్థాపించినా, నీతా అంబానీ ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్‌ను సొంతం చేసుకున్నా, లేదా అనంత్ అంబానీ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వంటారాను ప్రారంభించినా-- అంబానీలకు ఇది ఉమ్మడిగా ఉంటుంది. వారి కలలను సాకారం చేసుకున్నారు వంటారాను స్థాపించి.

నీతా అంబానీ భరతనాట్యం నృత్యకారిణి. ఆమె ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను ప్రారంభించడం వెనుక ఉన్న ప్రేరణతో కళలు, సంస్కృతిపై లోతైన ఆసక్తిని కలిగి ఉంది. ఆమెలాగే ఆమె కోడలు రాధికా మర్చంట్ కూడా శిక్షణ పొందిన నృత్యకారిణి.

అంబానీ కుటుంబం గణనీయమైన సంపద కలిగి ఉన్నప్పటికీ ముఖేష్, నీతా అంబానీలు దాతృత్వం, జీవితంలోని చిన్న క్షణాలను కూడా గొప్ప వేడుకగా చేసుకుని ఆనందిస్తుంటారు.

ధీరూభాయ్ అంబానీ చెప్పిన మాటలు అందరికీ ఆదర్శంగా ఉంటాయి.. "మీరు మీ కలను నిర్మించుకోకపోతే, ఇతరులు తమ కలలను సాకారం చేసుకోవడానికి మీరు పని చేయాల్సి ఉంటుంది. ఆయన వారసత్వమే ఇందుకు నిదర్శనం!

వారి అపారమైన సంపద, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, అంబానీ కుటుంబం ఎల్లప్పుడూ సామాజిక కార్యక్రమాలు, ఫంక్షన్లలో కలిసి కనిపిస్తారు. వారు బంధాలను నిలబెట్టుకుంటారు, సంస్కృతి, సంప్రదాయాన్ని పెంపొందించుకుంటారు.

చమురు, గ్యాస్ రంగం కావచ్చు. జియో, రిలయన్స్ రిటైల్, క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్, వారి పాఠశాల లేదా వంటారాలో వారి పెట్టుబడులు కావచ్చు-- అంబానీలు వివిధ రంగాలలో వారి బహుముఖ ఆసక్తిని, సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఇది నిజంగా చాలా మందికి స్ఫూర్తిదాయకం.

Tags

Read MoreRead Less
Next Story