విడాకులు తీసుకున్న కూతురు.. మేళతాళాలతో పుట్టింటికి తీసుకువచ్చిన తండ్రి

విడాకులు తీసుకున్న కూతురు.. మేళతాళాలతో పుట్టింటికి తీసుకువచ్చిన తండ్రి
అది పెళ్లి మేళం కాదు.. విడాకుల మేళం.. ఆ ఇంట ఒకప్పుడు భాజా భజంత్రీలు మోగాయి.

అది పెళ్లి మేళం కాదు.. విడాకుల మేళం.. ఆ ఇంట ఒకప్పుడు భాజా భజంత్రీలు మోగాయి. కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. అత్త ఇంట్లో తన కూతురు సంతోషంగా ఉండాలి అని అడిగినవన్నీ ఇచ్చారు. అబ్బాయి మంచోడని నమ్మారు. కానీ మూడు ముళ్ల బంధం మూడు నాళ్ల ముచ్చటే అయింది. అత్తింటి ఆరళ్లు భరించలేకపోయింది. కూతురు కన్నీళ్లు పెడుతుంటే తట్టుకోలేకపోయారు కన్నతల్లిదండ్రులు. వివాహం ఎంత ఘనంగా చేశామో విడాకులు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తామని, మా కూతురుకి ఆ దుర్మార్గుల నుంచి విముక్తి దొరికింది అని సంతోషిస్తూ సంబరాలు చేశారు.

ఈ సంఘటన జార్ఖండ్‌లో జరిగింది, ఒక వ్యక్తి తన పెళ్లైన కుమార్తెను ఆమె అత్తమామల ఇంటి నుండి తిరిగి తీసుకురావడానికి బారాత్ నిర్వహించారు. బాణసంచా కాల్చారు.తన కూతురు సాక్షి గుప్తాను అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని యువతి తండ్రి ప్రేమ్ గుప్తా తెలిపారు.

ప్రతి తల్లిదండ్రి తమ కుమార్తెలకు ఆడంబరంగా వివాహం చేస్తారు. అయితే జీవిత భాగస్వామి, కుటుంబం ఆమె పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, ఆమె అక్కడే ఉండి బాధలు పడి, చివరికి ప్రాణాలు తీసుకుంటే దానికి బాధ్యులు ఎవరు. అంతటి అనర్థం జరగకముందే మేల్కోండి. కాబట్టి మీరు మీ కుమార్తెలను గౌరవంగా మీ ఇంటికి తిరిగి తీసుకురావాలి, ఎందుకంటే కుమార్తెలు చాలా విలువైనవారు.

తన కుమార్తె సాక్షిని సచిన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి ఏప్రిల్ 28, 2022 న వివాహం చేసినట్లు తెలిపారు. రాంచీలోని సర్వేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న సచిన్ జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

కొన్ని రోజుల తర్వాత తన కూతురు అత్తమామలు ఆమెను వేధించడం మొదలుపెట్టారని ప్రేమ్ ఆరోపించారు. సచిన్ కుమార్ (సాక్షి భర్త) ఆమెను ఇంటి నుండి బయటకు పంపేవాడు. ఏడాది తర్వాత తనతో పెళ్లయిన వ్యక్తికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలిసి షాక్‌కు గురైంది.

అయితే ఆ సంబంధం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు సాక్షి నిర్ణయాన్ని స్వాగతించారు. బాణాసంచా కాల్చి ఆమె అత్తమామల ఇంటి నుండి ఊరేగింపుగా ఆమెను తిరిగి పుట్టింటికి తీసుకువచ్చారు.

ప్రేమ్ గుప్తా సంతోషంతోనే ఈ అడుగు వేశానని, తన కూతురు దోపిడీ నుంచి విముక్తి పొందిందని తెలిపారు. విడాకుల కోసం సాక్షి కోర్టులో కేసు వేసింది. కాగా, సాక్షికి మెయింటెనెన్స్ చెల్లిస్తానని సచిన్ చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story