ట్రక్ డ్రైవర్‌గా మారిన లాయర్.. అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసంతో..

ట్రక్ డ్రైవర్‌గా మారిన లాయర్.. అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసంతో..
అన్నింటా సమానత్వం అని ఎంత గొంతు చించుకున్నా ఆడవాళ్లకు ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి పని చేసే చోట..

అన్నింటా సమానత్వం అని ఎంత గొంతు చించుకున్నా ఆడవాళ్లకు ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి పని చేసే చోట.. అయినా వాటన్నింటినీ దాటుకుని నిలబడి తానేంటో నిరూపించుకుంటుంది మహిళ.

యోగితా రఘువంశీ భారతదేశపు మొదటి మహిళా ట్రక్ డ్రైవర్‌. ఆమె అర్హత కలిగిన ఒక న్యాయవాది. ఆమె కథ ఎందరికో స్ఫూర్తి దాయకం. తమపై తమకు నమ్మకం ఉంటే ఎవరెన్ని అన్నా ధృఢంగా నిలబడగలుగుతారు అని చెబుతుంది. ఆత్మవిశ్వాసం అన్ని అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది అని అంటుంది యోగిత. తమకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా విజయం సాధించవచ్చో తెలియజేస్తుంది.

యోగితా రఘువంశీ 2006లో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్‌గా అవతరించింది. ఆమె తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రోడ్డుపైకి వచ్చి ట్రక్ స్టీరింగ్ తిప్పింది. రోడ్డుపై డ్రైవర్లు ఎదుర్కొంటున్న అవినీతి, వేధింపుల గురించి యోగిత నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. ఆమె ఇటీవల రవాణా సంస్థ AITWA ప్రత్యేక కార్యదర్శి సుమితా దావ్రా సమక్షంలో తన ప్రసంగంతో అలరించింది."RTOలు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నా సంతృప్తి చెందరు. డ్రైవర్ల నుండి వచ్చే ఆదాయంతో వారి కుటుబాలను పోషించుకుంటారు'' అని RTO లపై వ్యంగాస్త్రాలు విసిరింది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రఘువంశీ 15 ఏళ్లకు పైగా ప్రయాణించారు. ఈ కాలంలో, ఆమె తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ దేశంలో సగానికి పైగా ప్రయాణించింది. యోగిత లా మరియు బిజినెస్‌లో డిగ్రీలు చేసింది. ఆమె సెలూన్‌లో కూడా పనిచేసింది. న్యాయవాద వృత్తిని కొనసాగించాలని భర్త సూచించే వరకు ఆమె భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా తన విధులు నిర్వర్తించేది.

అయితే లాయర్ గా తాను పెద్దగా సంపాదించలేకపోయింది. దానికి తోడు భర్త మరణం ఆమెను ఆర్థికంగా, మానసికంగా మరింత కృంగ దీసింది. కానీ కళ్ల ముందు పిల్లలు కనిపిస్తున్నారు. ధైర్యాన్ని కూడగట్టుకుంది. డ్రైవింగ్ పట్ల తనకు ఉన్న ఆసక్తిని ఉపాధిగా మార్చుకోవాలనుకుంది. మగవారు మాత్రమే పనిచేసే ఆడవాళ్లు కూడా పని చేయగలరని నిరూపించింది.

ఆమె భోపాల్ నుండి హైదరాబాద్ వరకు 1,100 మైళ్ల ప్రయాణాన్ని కేవలం మూడు రోజుల్లోనే చేసింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు భరించింది. అసభ్యకరమైన వ్యాఖ్యలు, బెదిరింపులు, మరెన్నో ఇతర సమస్యలను ఎదుర్కున్నానని వెల్లడించింది. "ఆ కష్టాలను అధిగమించి, నా పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి వెనుకడుగు వేయకూడదని నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది.

ఆమె ఇప్పుడు ఓ శక్తివంతమైన మహిళ. ఆమె జీవన మార్గంలో సవాళ్లను ఎదుర్కొనే చాలా మందికి ప్రేరణగా నిలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story