ఓట్ల లెక్కింపు తేదీని మార్చమని దేవుడికి ప్రార్థన.. ఎందుకో తెలుసా!!

ఓట్ల లెక్కింపు తేదీని మార్చమని దేవుడికి ప్రార్థన.. ఎందుకో తెలుసా!!

క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరగడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని రిటైర్డ్ పాస్టర్ రెవరాండ్ కెసి వన్‌లాల్దుహా అన్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప్రార్థించ‌డం మామూలు విష‌యం కాదు. కొంతమంది తమ అభిమాన అభ్యర్థి లేదా రాజకీయ పార్టీ విజయం కోసం ప్రార్థిస్తారు. హింస రహిత పోలింగ్ కోసం మరి కొందరు ప్రార్థిస్తారు. అయితే ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని ప్రార్థించడం ఎక్కడా విని ఉండము.

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణతో పాటు నవంబర్ 7న ఎన్నికలకు వెళ్లిన మిజోరాంలో, ఓట్ల లెక్కింపు రోజు ఆదివారం వచ్చింది. దీనిని మార్చడానికి దైవిక జోక్యాన్ని కోరుతూ చర్చిలలో ప్రార్థనలు జరిగాయి.

ఈ విషయంపై పాస్టర్ మాట్లాడుతూ.. "చర్చి సేవలు మూడుసార్లు జరుగుతాయి - ప్రతి ఆదివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జరుగుతాయి. డిసెంబర్ 3న ఓట్లను లెక్కించినట్లయితే, మా సభ్యులలో చాలా మంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. చర్చికి హాజరు కాలేరు అని అన్నారు. ఈ మేరకు దేవుని ప్రార్థించాము. డేట్ మార్చమని దేవుని సహాయం కోరాము అని అన్నారు.

"మా పిలుపుకు ప్రతిస్పందిస్తూ, నిన్న (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించారు," అని 'మిజోరం ప్రెస్బిటేరియన్ చర్చి'లో సభ్యుడైన రెవ్ వన్‌లాల్దుహా మీడియాతో అన్నారు. ఇది కేవలం ఒక వర్గమే కాదు, మతాలవారీగా చర్చిలలో ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు.

మిజోరాం NGO కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందం ప్రస్తుతం న్యూఢిల్లీలో క్యాంప్ నిర్వహిస్తోంది. మంగళవారం EC అధికారులను కలవడానికి అపాయింట్‌మెంట్ పొందింది. పోల్ షెడ్యూల్ ముగిసిన వెంటనే, కౌంటింగ్ తేదీని మార్చాలని ECకి అనేక విజ్ఞప్తులు అందాయి. కానీ అవేవీ విజయవంతం కాలేదు.

Tags

Read MoreRead Less
Next Story