అమ్మ లేదు.. నాకు పాలు తాగాలని లేదు: రైలు ఢీకొన్న ఘటనలో తల్లి ఏనుగు

అమ్మ లేదు.. నాకు పాలు తాగాలని లేదు: రైలు ఢీకొన్న ఘటనలో తల్లి ఏనుగు
కొన్ని జంతువుల వల్ల మనుషులకు హాని ఉన్నా అవి అన్యాయంగా ప్రాణాలు కోల్పోతే మనసున్న ప్రతి ఒక్కరినీ ఆ విషయం కదిలిస్తుంది.

కొన్ని జంతువుల వల్ల మనుషులకు హాని ఉన్నా అవి అన్యాయంగా ప్రాణాలు కోల్పోతే మనసున్న ప్రతి ఒక్కరినీ ఆ విషయం కదిలిస్తుంది. అందునా తన బిడ్డలను పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకునే మూగజీవులలో ఏ ఒక్కరు మరణించినా మూగగా రోదిస్తుంది. మనుషుల కంటే ఎక్కువగా స్పందిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతంలో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. పిల్ల ఏనుగు గాయాలతో బయటపడింది. తాను లేకపోయిన తన బిడ్డ బతకాలని బలంగా కోరుకుందేమో తల్లి ఏనుగు.. తన ఆయుష్షును కూడా బిడ్డకు ఇచ్చి తనువు చాలించింది. ఈ సంఘటన ఫారెస్ట్ అధికారులనే కాదు, అక్కడున్న స్థానికులను సైతం కదిలించింది.

కార్బెట్ నేషనల్ పార్క్ ప్రాంతం సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా తల్లి ఏనుగును, దాని బిడ్డను వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఏనుగు పిల్ల పట్టాలపై నుండి విసిరివేయబడి, ఎలివేటెడ్ రైలు ట్రాక్ క్రింద ఉన్న పొలంలో పడిపోయింది. పిల్ల ఏనుగు అద్భుతంగా అపాయం నుంచి తప్పించుకుంది కానీ, తల్లి ఏనుగు మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. లోతట్టు ప్రాంతంలో గాయాలతో పడిఉన్న ఏనుగు పిల్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. "బాని" అని పేరు పెట్టబడిన పిల్ల ఏనుగు ప్రమాదం నుండి బయటపడింది. కానీ ఆ గున్నకు వెన్నెముక, తుంటి కీళ్లపై గాయాలయ్యాయి. ఏనుగు పిల్లను అత్యవసర క్రిటికల్ కేర్ కోసం మథురలోని ఎలిఫెంట్ ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు అటవీ శాఖ అధికారులు. అంతకు ముందే వైల్డ్‌లైఫ్ SOS పిల్ల ఏనుగుకు ప్రాథమిక చికిత్స అందించారు.

వైల్డ్‌లైఫ్ SOS, వెటర్నరీ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఇళయరాజా ఎస్ మాట్లాడుతూ, “పిల్ల ఏనుగు గజ్జ ప్రాంతంలో గాయం ఉంది, దీనికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. దాని ముందు కాళ్లు బాగా కదులుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మొదట్లో, వెన్నెముకకు గాయమైందని భావించాము. కానీ దాని తోకలో కదలిక, జీర్ణక్రియ, సాధారణ శరీర విధులు, 0 శరీరం చికిత్సకు ప్రతిస్పందించడంతో దాని ప్రాణాలకు ప్రమాదం లేదని భావించి ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు.

వైల్డ్‌లైఫ్ SOS సహ వ్యవస్థాపకుడు మరియు CEO కార్తిక్ సత్యన్నారాయణ మాట్లాడుతూ, “బాని ఏనుగును మథురలోని ఎలిఫెంట్ హాస్పిటల్‌కు తరలించడానికి త్వరితగతిన అనుమతులు జారీ చేసినందుకు ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అది త్వరగా కోలుకోవడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

గీతా శేషమణి, సహ వ్యవస్థాపకులు మరియు కార్యదర్శి వైల్డ్‌లైఫ్ SOS మాట్లాడుతూ, “రైలు ఢీకొనడం వల్ల ప్రతి సంవత్సరం వేలాది జంతువులు చనిపోతున్నాయి. రైల్వేలు దేశవ్యాప్తంగా, వన్యప్రాణుల కారిడార్‌లలో వేగాన్ని తగ్గిస్తే, ఏనుగులు మరియు ఇతర వన్యప్రాణులను రక్షించవచ్చని మేము ఆశిస్తున్నాము. ఏనుగులు రైల్వే ట్రాక్ దాటుతున్నప్పుడు గుర్తించి, అప్రమత్తం చేయగల సాంకేతిక పరిజ్ఞానం త్వరలో అందుబాటులోకి రానుంది.

వైల్డ్‌లైఫ్ SOSలో కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ బైజు రాజ్ MV మాట్లాడుతూ, “బాని” వయస్సు 9 నెలలు. ప్రతిరోజూ దాని శరీరాన్ని శుభ్రం చేసి, మసాజ్ చేస్తున్నారు. అంటువ్యాధులను నివారించేందుకు గాయాలకు కట్టు కట్టారు. గాయపడిన కీళ్లకు వ్యాయామం చేయడానికి లేజర్ థెరపీ, ఫిజియోథెరపీ అందిస్తున్నారు. దాని సంరక్షణకారులు బాటిల్ లో పాలు పోసి బానికి అందిస్తున్నారు. ఆ సమయంలో దాని కళ్లలో తల్లి లేదన్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. మనుషులకు మాదిరిగానే జంతువులు కూడా కళ్లతో భావాన్ని పలికించగలవు. అర్థం చేసుకునే వారికి దాని ఆవేదన అర్థమవుతుంది.

అధికారిక రికార్డుల ప్రకారం, 2010 మరియు 2020 మధ్యకాలంలో దాదాపు 200 ఏనుగులు రైలు ఢీకొనడంతో చనిపోయాయి. ప్రతి సంవత్సరం సగటున 20 ఏనుగులు ట్రాక్ దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story