అతను నిజమైన కష్టాన్ని నమ్ముతారు..అందుకే అలా మాట్లాడారు: సుధామూర్తి

అతను నిజమైన కష్టాన్ని నమ్ముతారు..అందుకే అలా మాట్లాడారు: సుధామూర్తి
ఇటీవల ముగిసిన 14వ టాటా లిట్ ఫెస్ట్‌లో భాగంగా సుధా మూర్తి మాట్లాడుతూ, తన భర్త టెక్-ఆంట్రప్రెన్యూర్ నారాయణ మూర్తి వారానికి 80 నుండి 90 గంటలు పని చేస్తాడు.అంతకంటే పని చేయడం తప్ప తనకు మరొకటి తెలియదని అన్నారు.

ఇటీవల ముగిసిన 14వ టాటా లిట్ ఫెస్ట్‌లో భాగంగా సుధా మూర్తి మాట్లాడుతూ, తన భర్త టెక్-ఆంట్రప్రెన్యూర్ నారాయణ మూర్తి వారానికి 80 నుండి 90 గంటలు పని చేస్తాడు.అంతకంటే పని చేయడం తప్ప తనకు మరొకటి తెలియదని అన్నారు. అతను నిజమైన కష్టాన్ని నమ్ముతాడు. అతను అలా జీవించాడు. అందుకే, తనకు అనిపించిన విషయాన్ని చెప్పాడు." అని అన్నారు.

దేశ ఉత్పాదకతను పెంచాలంటే యువకులు వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదానికి దారి తీశాయి. దీనిపై ఆయన భార్య సుధా మూర్తి స్పందించారు.

చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ మరియు జర్మనీలు చేసినట్లుగా దేశంలోని యువత అదనపు గంటలు పని చేయాలి అని మాజీ ఇన్ఫోసిస్ CFO మోహన్‌దాస్ పాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఆదివారం ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NCPA)లో ఇటీవల ముగిసిన 14వ టాటా లిట్ ఫెస్ట్‌లో ఉన్న మూర్తి భార్య రచయిత్రి సుధామూర్తి ని ఇదే విషయమై ప్రశ్నించగా .. ఆమె తన భర్త అభిరుచిని, “నిజమైన కృషిని” నమ్ముతాడని, “అతను వారానికి 80 నుండి 90 గంటలు పని చేసాడు, కాబట్టి, దానికంటే తక్కువ ఏమిటో అతనికి తెలియదు. అతను వాస్తవాన్ని నమ్ముతాడు. కష్టపడి పని చేసి అలా జీవించాడు.

“ప్రజలు భావవ్యక్తీకరణకు భిన్నమైన మార్గాలను కలిగి ఉంటారు. కానీ అతను అలా జీవించాడు, అతను మాట ప్రకారం నడిచాడు. కాబట్టి, అతను తన అనుభవాన్ని పంచుకున్నాడు అని ఆమె అన్నారు.

“నేను చాలా విషయాలు అతని నుండి నేర్చుకున్నాను. ఒక లక్ష్యాన్ని ఉంచుకుని, దాని కోసం కృషి చేయడం మొదటిది. పని చేస్తున్నప్పుడు పరధ్యానంలో ఉండకూడదనేది రెండవ విషయం. ఇక మూడవ విషయానికి వస్తే- మీకు అభిరుచి ఉంటే, అప్పుడు మాత్రమే మీరు రాణిస్తారు అని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story