కొత్త ఓటు నమోదు చేసుకునే గడువు..

కొత్త ఓటు నమోదు చేసుకునే గడువు..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారుల్లో హడావిడి మొదలైంది. ఓటు హక్కు ఉన్న వ్యక్తి కొత్త ఓటు నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారుల్లో హడావిడి మొదలైంది. ఓటు హక్కు ఉన్న వ్యక్తి కొత్త ఓటు నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. 2022లో 2 లక్షల 75 వేల డూప్లికేట్ ఓట్లను తొలగించామని, గడిచిన వారం రోజుల్లో 50 వేల నకిలీ ఓట్లు తొలగించామని ఆయన పేర్కొన్నారు. 3 లక్షల 61 వేల ఓట్లకు షిప్ట్ అయిన వారు అప్లై చేసుకున్నారని, ఓటర్ ఐడెంటిఫ్లికేషన్ స్లిప్స్ ను ప్రతి ఓటర్ కు పంచుతామని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా ఓటు ఎక్కడ వేయాలనేది తెలుస్తుంది అన్నారు.

అంతేకాకుండా.. పకడ్భందీగా ఎలక్టోరల్ చేశామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్.. 90 ఫ్లయింగ్ స్వ్కాడ్ లతో పాటు జిల్లా పరిధిలో 18 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మద్యం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై ఎలక్షన్ కమీషన్ చాలా సీరియస్ గా ఉందన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 18.9 కోట్లు ఇప్పటికే పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. 15 లక్షల రూపాయిల ఫ్లయింగ్ స్క్వాడ్ లు సీజ్ చేశారు. 132 కేసులు ఇప్పటి వరకు నమోదు చేశామని అన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చినటప్పటి నుండి 50 వేల ఓట్లు తొలగించినట్లు రొనాల్డ్ రోస్ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story