స్విగ్గీ, జొమాటో వద్దు.. పిల్లలకు అమ్మచేతి వంటే ముద్దు: కేరళ హైకోర్టు

స్విగ్గీ, జొమాటో వద్దు.. పిల్లలకు అమ్మచేతి వంటే ముద్దు: కేరళ హైకోర్టు
ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం వచ్చే సరికి పిల్లలకు అమ్మ చేతి వంట కూడా నచ్చకుండా పోతోంది.

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం వచ్చే సరికి పిల్లలకు అమ్మ చేతి వంట కూడా నచ్చకుండా పోతోంది. ఏది కావాలంటే అది క్షణాల్లో తెప్పించుకుని తినేయొచ్చని భావిస్తుంటారు. కానీ కమ్మగా వండి పెట్టే అమ్మ చేతి వంట ముందు ఏదైనా దిగదుడుపే.. ఎక్కడ ఆడుకుంటున్న అమ్మ వంట చేస్తుంటే ఆ వాసనకు పిల్లలు వచ్చేస్తారు. ఆరోగ్యానికీ అదే మంచిది అని కేరళ హైకోర్టు సూచించింది.

అశ్లీల చిత్రాలకు సంబంధించిన నేరానికి సంబంధించిన కేసును విచారిస్తున్న సందర్భంగా కేరళ హైకోర్టు మంగళవారం పిల్లలకు ఇంట్లో వండిన భోజనం అందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. స్విగ్గీ మరియు జొమాటో ద్వారా రెస్టారెంట్ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయకుండా నిరోధించాలని తల్లిదండ్రులను కోర్టు సూచించింది.

ఓ యువకుడు తన మొబైల్‌లో పోర్న్ చూస్తున్నందున పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే అతడిపై నేరారోపణలను కోర్టు రద్దు చేసింది, అశ్లీల చిత్రాలను ప్రైవేట్‌గా చూడటం నేరంగా పరిగణించబడదని కోర్టు తీర్పు చెప్పింది. భారతదేశ శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 ప్రకారం ఈ తీర్పు వెలువరించింది.

అలాగే "స్విగ్గీ' 'జొమాటో' వంటి యాప్ ల ద్వారా రెస్టారెంట్ల నుండి ఆహారాన్ని కొనుగోలు చేయడానికి బదులుగా, పిల్లలు వారి తల్లి చేసిన రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించండి. ఖాళీ సమయంలో పిల్లలను ప్లేగ్రౌండ్‌లలో ఆడుకోనివ్వండి. కమ్మనైన అమ్మ చేతి వంట రుచి చూసేందుకు పిల్లలు త్వరగా ఇంటికి తిరిగి రావాలి అని కేరళ హైకోర్టు పేర్కొంది.

సరైన పర్యవేక్షణ లేకుండా మైనర్ పిల్లలకు మొబైల్ ఫోన్‌లు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాల గురించి న్యాయమూర్తి తల్లిదండ్రులను హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story